NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ సీజన్‌ 7 కంటెస్టెంట్స్‌ జాబితా ఇదే.. ఈసారి ఎవరెవరున్నారంటే?

Bigg Boss Telugu

Bigg Boss Telugu

Bigg Boss Telugu 7 Contestants List: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ ఇప్పటివరకు తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఆదివారం (సెప్టెంబర్ 3) ఏడో సీజన్‌ అట్టహాసంగా ఆరంభమైంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వచ్చారు. ‘ఈ సీజన్‌లో అన్నీ ఉల్టా పల్టా’ అంటూ ఇన్ని రోజులు ఆసక్తి రేకెత్తించిన నాగ్.. తొలుత హౌస్‌లోకి వచ్చి విశేషాలు పంచుకున్నారు. ఆపై కంటెస్టెంట్‌లను పరిచయం చేశారు. ఇక నాగార్జున తన సరికొత్త గెటప్, తనదైన చమత్కారాలతో ఏడో సీజన్‌ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ని చాలా ఎంటర్‌టైనింగ్‌గా నడిపించారు.

సీజన్‌-7లో భాగంగా తొలి కంటెస్టెంట్‌ ‘జానకి కలగనలేదు’ సీరియల్ నటి ప్రియాంక జైన్ హౌసులోకి అడుగుపెట్టారు. రెండో కంటెస్టెంట్‌గా మాజీ హీరో శివాజీ ప్రవేశించారు. మూడో కంటెస్టెంట్‌గా సింగర్ దామిని రాగా.. నాలుగో కంటెస్టెంట్‌గా ప్రిన్స్ యావర్ వచ్చాడు. ఆపై శుభశ్రీ, షకీలా, ఆట సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, రతిక రోజ్‌, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ బిగ్‌బాస్ హౌసులోకి అడుగుపెట్టారు.

మరోవైపు తమ కొత్త చిత్రాలను ప్రమోట్‌ చేసుకునే క్రమంలో టాలీవుడ్ యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ, నవీన్‌ పొలిశెట్టి సందడి చేశారు. దేవరకొండ, నవీన్‌ కలిసి కింగ్ నాగార్జునతో సరదాగా మాట్లాడారు. ఆపై ఈ ఇద్దరు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్‌లను ఉత్సాహపరిచారు. దేవరకొండ ఖుషి సినిమా ప్రమోట్‌ చేసుకునేందుకు హౌసులోకి రాగా.. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా కోసం నవీన్ వచ్చాడు.

Also Read: KL Rahul: ఎన్‌సీఏ గ్రీన్ సిగ్నల్.. ప్రపంచకప్‌ 2023 జట్టులో కేఎల్ రాహుల్‌!

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 కంటెస్టెంట్స్‌ జాబితా:
ప్రియాంక జైన్‌
శివాజీ
దామిని భట్ల
ప్రిన్స్‌ యవార్‌
శుభశ్రీ
షకీలా
ఆట సందీప్‌
శోభా శెట్టి
టేస్టీ తేజ
రతిక రోజ్‌
డాక్టర్‌ గౌతమ్‌ కృష్ణ
కిరణ్‌ రాథోడ్‌
పల్లవి ప్రశాంత్‌
అమర్‌దీప్‌

Show comments