Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !

Bigboss Agnipariksha

Bigboss Agnipariksha

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ (Bigg Boss Season 10) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 6 నుంచి మొదలుకానున్న ఈ గ్రాండ్ షోకు మళ్లీ కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ షోలో ముఖ్యంగా సెలబ్రిటీలతో పాటు సామాన్యులు హౌస్‌లోకి అడుగుపెట్టేందుకు నిర్వాహకులు బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష 2’ పేరుతో ఒక ప్రత్యేక రౌండ్‌ను నిర్వహించారు. మొదటి సీజన్‌లో అగ్నిపరీక్ష నుంచే కళ్యాణ్ పడాల విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

అగ్నిపరీక్ష పోటీదారులు..
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో స్థానం దక్కించుకున్న మొత్తం 15 మంది కంటిస్టెంట్లలో ఇప్పటికే ఒకరి ఎలిమినేషన్ పూర్తయింది. ఈ రేసు నుంచి గాయత్రి నిష్క్రమించడంతో ప్రస్తుతం హౌస్ రేసులో 14 మంది పోటీదారులు ఉన్నారు. వీరి నుంచి కేవలం 5 లేదా 6 మందికి మాత్రమే సెప్టెంబర్ 6న నాగార్జున గ్రాండ్ లాంచ్ వేదికగా బిగ్ బాస్ ప్రధాన హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించనున్నారు.

సోషల్ మీడియా, లీకైన వర్గాల సమాచారం ప్రకారం.. ఝాన్సీ ఇప్పటికే తన టాస్క్‌లు, మాటతీరుతో నిర్వాహకులను మెప్పించి బిగ్ బాస్ ప్రధాన హౌస్‌లోకి డైరెక్ట్ ఎంట్రీని ఖరారు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఝాన్సీతో పాటు అగ్నిపరీక్షలో ఇచ్చిన ప్రతి ఫిజికల్, మైండ్ గేమ్ టాస్క్‌లలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న రోహిత్ నాయుడు కూడా కచ్చితంగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. రేసులో ముందున్న ఇతర పోటీదారుల విషయానికి వస్తే.. చరణ్, మిథిలేష్, రాజకుమారి, అమన్ మసూద్, షాలినీ, అపూర్వ, రామకృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో నలుగురికి హౌస్‌లోకి ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.

కామనర్స్‌పై పెరిగిన అంచనాలు..
గత సీజన్లలో కామనర్స్‌గా వచ్చిన పల్లవి ప్రశాంత్, కళ్యాణ్ పడాల వంటి వారు టైటిల్ సాధించి రికార్డు సృష్టించగా.. ఈసారి అగ్నిపరీక్ష నుంచి ఎంపికై హౌస్‌లోకి అడుగుపెట్టే 5 లేదా 6 మంది సామాన్యులు సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కింగ్ నాగార్జున మార్క్ హోస్టింగ్, అగ్నిపరీక్ష విజేతల గ్రాండ్ ఎంట్రీతో సెప్టెంబర్ 6న ప్రారంభమయ్యే బిగ్ బాస్ 10 సరికొత్త వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉంది.