Big Boss 8 Telugu Winner: ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. అన్ లిమిటెడ్ టర్న్‌లు, ట్విస్ట్‌లు అంటూ.. సెప్టెంబర్ 01 ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 8లో విజేత ఎవరనే విషయం తేలిపోయింది. కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8గా నిలిచాడు. రన్నరప్‌గా గౌతమ్ అవతరించాడు. బిగ్‌బాస్ సీజన్ 8 తెలుగులో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ షోలో పాల్గొనగా.. ఫినాలే వీక్‌కి చేరేసరికి గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌లు ఫైనలిస్ట్‌గా నిలిచారు. నిఖిల్ వర్సెస్ గౌతమ్‌ల మధ్య విన్నింగ్ రేస్‌లో నిఖిల్ విజేతగా నిలవగా.. గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు. విజేత నిఖిల్ రూ.55 లక్షల ప్రైజ్‌మనీతో పాటు.. మారుతీ సుజూకీ కారును సొంతం చేసుకున్నాడు. నటుడు నిఖిల్ గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సీరియల్‌లో పార్థుగా ఆడియన్స్‌ను అలరించాడు. నిఖిల్ సొంతూరు కర్ణాటకలోని మైసూరు. నిఖిల్ తండ్రి జర్నలిస్ట్ కావడం విశేషం. సీరియల్ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో అభిమానం సంపాదించిన నిఖిల్.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా మరో మెట్టు ఎక్కాడు.
రన్నరప్‌గా నిలిచిన గౌతమ్.. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వైల్డ్ కార్డు ద్వారా వచ్చినా నిఖిల్‌కు మాత్రం గట్టి పోటీనిచ్చాడు. ఎలిమినేట్ అయిపోయాడనుకున్న గౌతమ్..తిరిగి టైటిల్ రేస్‌లో నిలిచి నిఖిల్‌కు చెమటలు పట్టించడంతో పాటు చివరి వరకూ గట్టి పోటీనిచ్చాడు. బిగ్‌బాస్ 8 తెలుగు విన్నర్ ఎవరా అని అభిమానుల్లో ఉత్కంఠ రేపిన ఘనత మాత్రం గౌతమ్‌కు దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గౌతమ్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వకపోయి ఉంటే నిఖిల్ విన్నర్ అని ప్రేక్షకులు ఎప్పుడో ఫిక్స్ అయిపోయేవారు. కానీ గౌతమ్ రావడంతో టైటిల్ రేసులో మరో ఆప్షన్ వచ్చింది.చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చిన గౌతమ్.. చాలా తక్కువ ఓటింగ్ తేడాతో మాత్రమే రన్నరప్‌గా నిలిచాడు. ఏదైతేనేం ఇద్దరు విన్నర్స్ కావడానికి అర్హులే. అయితే నిఖిల్‌కి కొద్ది మొత్తంలో ఓటింగ్ అధికంగా రావడంతో విన్నర్ అయ్యాడు. గౌతమ్ రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.