Biggboss season 7 : బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన షకీలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున ఎంట్రీ ఇస్తూ అదరగొట్టారు ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో గేమ్ రూల్స్ అంతగా చేంజ్ చేయడం జరిగింది… దీనితో ఈ సరికొత్త సీజన్ ఎలా ఉండబోతోందో అని బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఉల్టా పుల్టా అంటూ షో పై బుల్లి తెర ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లోకి వరుసగా కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా శృంగార తార షకీలా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వచ్చారు..మలయాళీ చిత్రాలతో షకీలా ఎంతగానో పాపులర్ అయ్యారు..శృంగార భరిత సినిమాలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించారు షకీలా. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తన కొత్త జర్నీని స్టార్ట్ చేసారు షకీలా.బిగ్ బాస్ హౌస్ లో తన ఎంట్రీ ముందు లైఫ్ జర్నీ గురించి వివరించింది షకీలా. నా పేరు సి షకీలా జాన్. మా అమ్మది నెల్లూరు మా నాన్నది చెన్నై. నేను 10 వ తరగతి ఫెయిల్ అయ్యాను. దీనితో నన్ను నాన్న బాగా కొట్టేవారు. మాకు తెలిసిన మేకప్ మ్యాన్ నన్ను సినిమాల్లోకి రమ్మని ఆహ్వానించారు. దీనితో ఏవిఎం స్టూడియో కి వెళితే సిల్క్ స్మిత సిస్టర్ గా నన్ను ఒకే చేశారు.అక్కడికి వెళ్లిన తర్వాత బట్టలు విప్పేయమనడం లాంటి సంఘటనలు నాకు ఎదురయ్యాయి. ఈ విషయం నాన్నకి చెబితే చేయనని చెప్పు అంటూ ఎంతో ఈజీగా అనేశారు. నేను వాళ్ళకి కేవలం బంగారు గుడ్డు పెట్టే బాతు మాత్రమే అంటూ తన కుటుంబం గురించి చెబుతూ షకీలా ఎమోషనల్ అయింది.
నన్ను నా కుటుంబం ఒక డబ్బు యంత్రంగానే చూశారని చెబుతూ షకీలా కన్నీరు పెట్టుకుంది. తను మలయాళంలో శృంగార పాత్రలు చేసినట్లు చెప్పుకొచ్చింది.సినిమాలలో ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో నేను ఇల్లు కొనుక్కొని సెటిల్ అవుదామని అనుకున్నాను కానీ నా కుటుంబానికి ఆ విషయం నచ్చలేదు.ఎందుకంటే నా నుంచి వచ్చే డబ్బు ఎక్కడ వారికీ రాకుండా పోతుందో అని వారి భయం అని చెప్పుకొచ్చింది..అందుకే నేను సంపాదించిన డబ్బు మొత్తం దాచి పెడతా అని మా అక్క నా దగ్గర నుండి తీసుకుంది. ఇప్పుడు ఆమె ఎంతో సుఖంగా వుంది అంటూ తాను కుటుంబ సభ్యుల చేసిన మోసం గురించి షకీలా తెలిపింది.ఇక వేదికపైకి రాగానే షకీలాని నాగార్జున ఆమెను పలకరించారు. షకీలా గురించి అనేక వివరాలు ఆయన తెలుసుకున్నారు. ఇక షకీలా ట్రాన్స్ జెండర్స్ కి సేవ చేస్తున్న విషయం తెలిసిందే. తాను సొంత బిడ్డలుగా చూసుకునే ఇద్దరు ట్రాన్స్ జండర్స్ తంగం, షాషా లని నాగార్జున వేదికపైకి పిలిచారు. వారిని చూడగానే షకీలా ఎమోషనల్ అయ్యారు..నాగార్జున ఆమెను ఓదార్చి బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు.
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!