Site icon NTV Telugu

Bigg Boss Season 7: బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్.. హౌస్ లోకి ఇద్దరు సీనియర్ నటులు..?

Tamil Bigg Boss

Tamil Bigg Boss

బిగ్ బాస్ 7 తెలుగు ఈ వారం హాట్ హాట్ గా ఉంది.. నాగార్జున అందరిని కడిగిపడేశాడు.. గతేడాదితో పోలిస్తే ఈ సారి కాస్తా ఫర్వాలేదనిపిస్తోంది. అయితే బిగ్ బాస్‌ రియాలిటీ షో దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నిర్వహిస్తున్నారు..కన్నడ బిగ్ బాస్ సీజన్-7 అక్టోబర్‌ 3వ తేదీ షురూ కానుంది. ఈ సారి కూడా కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రోమో రిలీజ్ కాగా.. కంటెస్టెంట్లను సైతం ప్రకటించారు.. అందుకు సంబందించిన ప్రోమో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి..

కాగా, తమిళ్ బిగ్ బాస్ 7 నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతుంది..ఈ ఏడాది సీజన్‌కు కూడా కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో అప్పుడే కోలీవుడ్‌ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసే కంటెస్టెంట్స్ లిస్ట్ తెగ వైరలవుతోంది. ఈ సారి నటుడు పృథ్వీ రాజ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా నటుడు అబ్బాస్ కూడా బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.. వీరిద్దరూ మంచి ఇమేజ్ ఉన్న నటులు.. వీరిద్దరిని హౌస్ లోకి పంపిస్తే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందనే ఆలోచనలో బిగ్ బాస్ ఉన్నట్లు తెలుస్తుంది..

ఇదిలా ఉండగా.. గత ఎపిసోడ్స్ లతో పోలిస్తే ఈ సీజన్ మరింత కలర్ ఫుల్ గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ ఏడాది తమిళ సీజన్‌లో అగ్రనటులు బబ్లూ పృథ్వీరాజ్, అబ్బాస్, వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్ హైలెట్‌గా నిలవనున్నారు. వీరితో పాటు రవీనా దాహా, నివిషా, అనన్య రావు, మాయా కృష్ణన్, రంజిత్, , బావ చెల్లదురై, కూల్ సురేష్, విష్ణు విజయ్, విచిత్ర, వాసుదేవన్, విక్రమ్, ప్రదీప్ ఆంటోనీ కూడా ఉన్నారు.. వీరంతా పలు సినిమా నటులు కావడం తో జనాలు ఆసక్తి చూపిస్తారని భావిస్తున్నారు.. ఇకపోతే తెలుగులో కూడా 7 సీజన్ జరుగుతుంది..

Exit mobile version