NTV Telugu Site icon

Big Boss: కొత్త ఆట, కొత్త అధ్యాయం.. కొత్త హోస్ట్‌ కూడానా..?

Bigg Boss

Bigg Boss

Big Boss 11 Kannada: కన్నడ టెలివిజన్‌లో అతిపెద్ద రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. సీజన్ 11కి సంబంధించి బిగ్ బాస్ లోగో ఎలా ఉంటుందో ఇప్పటికే రివీల్ చేసిన కలర్స్ కన్నడ.. ఇప్పుడు ఫస్ట్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కిచ్చా సుదీప్ ఈసారి షోని హోస్ట్ చేస్తాడా..? లేదా అనే ప్రశ్నల మధ్య ఆసక్తిని పెంచింది. కలర్స్ కన్నడ తన అధికారిక సోషల్ మీడియా పేజీలలో బిగ్ బాస్ లోగోను ఇప్పటికే పోస్ట్ చేసింది. నీరు, నిప్పుల కలయికలో బిగ్ బాస్ కన్ను అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, అలా షేర్ చేసిన పోస్ట్‌లో కిచ్చా సుదీప్(kichcha sudeep) అనే హ్యాష్‌ట్యాగ్ కనిపించలేదు. ఇది గమనించిన కొందరు సుదీప్ ఈసారి షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారా..? లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా విడుదలైన కొత్త ప్రోమోలో వారు మరింత శ్రద్ధ వహించారు.

Viral Video: అబ్బబ్బబ్బా.. చిన్నారి ఎంతబాగా పాడిందంటే.. వింటే ‘వావ్’ అనుకూండా ఉండలేరు..

ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రజలు తమ ఇళ్లలో, మొబైల్‌లలో, ప్రతిచోటా బిగ్ బాస్ చూసే సన్నివేశం చిత్రీకరించబడింది. “ఇది బిగ్ బాస్.. హలో కర్ణాటక. ఎలా ఉన్నావు? 10 సంవత్సరాలుగా చూస్తున్నావు. ఇది పెద్దదవుతోంది. ఈసారి ఇంకా పెద్దగా ఎదురుచూస్తోంది. ఇలా, ఇది కొత్త దశాబ్దం, కొత్త ఆట, కొత్త అధ్యాయం, బిగ్ బాస్ అంకెరూ హోసాబ్రా ” అంటూ కొనసాగింది. దింతో ఇప్పుడు ఈ మొదటి ప్రోమో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. సమాచారం మేరకు ఈ బిగ్ బాస్ సీజన్ 11 సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం బిగ్ బాస్ కిచ్చా సుదీప్ నేతృత్వంలో కలర్స్ కన్నడలో ప్రారంభమవుతుందా లేదా అనేది ఇప్పుడు అందరి ప్రశ్నగా మారింది. ఈ సారి సీజన్ లో కూడా పోటీదారుల జాబితాలో టీవీ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే రెండో ప్రోమో షూటింగ్ చివరి దశకు చేరుకోగా మరో వారం రోజుల్లో ప్రోమో విడుదల చేసే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి అందులో ఎన్ని ట్విస్ట్ లు ఇవ్వనున్నారో.

Show comments