Site icon NTV Telugu

Divvela Madhuri: తప్పు మీద తప్పు.. కేక్ కటింగ్ ఘటనతో దివ్వెల మాధురి మళ్లీ రచ్చ..!

Divvela Madhuri

Divvela Madhuri

Divvela Madhuri Controversy: తిరుమలలో రీల్స్ వివాదంతో ఇప్పటికే కేసు ఎదుర్కొంటున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ మాధురి మరోసారి వివాదంలో నిలిచారు. తిరుమలలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంతో ఆమెపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా కేక్ కట్ చేయడం ఈ వివాదానికి కారణమైంది.

Thala For A Reason: 7 వికెట్లు, 7 పరుగులు.. భారత్ విజయంలో ‘7’ సెంటిమెంట్.. ధోని ఫ్యాన్స్ ఫిదా?

వివరాల ప్రకారం.. బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధురి స్వయంగా తనూజతో కేక్ కట్ చేయించారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిబంధనల ప్రకారం ఆలయ పరిసరాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనుమతించబడదు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.

Sakshi Dhoni Reaction: ‘సాక్షి’ అత్యుత్సాహం.. ‘కామ్ డౌన్’ అంటూ ధోనీ క్యూట్ రియాక్షన్.. వీడియో వైరల్!

ఇదిలా ఉండగా.. తిరుమలలో రీల్స్ చేసిన కేసులో మాధురి గురువారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. ఆమెతో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా కోర్టుకు వచ్చారు. ఈ కేసును రెండవ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి కోటేశ్వరరావు విచారించారు. తిరుమల వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో మాధురి కోర్టు ఎదుట హాజరయ్యారు. విచారణ సందర్భంగా కోర్టు మే 12న ఇద్దరు జామీనుదారులతో పాటు జామీను పత్రాలను సమర్పించాలని ఆదేశించింది.

Exit mobile version