Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఆఖరు దశకు చేరుకుంది.ఫైనల్ వీక్ దగ్గరకు వస్తుంటే టాప్ 5లో ఎవరు ఉంటారన్న ఎగ్జైట్మెంట్ మొదలవుతుంది. ముఖ్యంగా చివరి రెండు వారాలే ఉన్న సమయంలో ఆడియన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్ ను టాప్ లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తారు. ఐతే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ అనగానే అందరు టాప్ 5 అనుకుంటారు. కానీ సీజన్ 7 లో టాప్ 6 ప్లాన్ చేశారు. ఇప్పుడు మళ్లీ సీజన్ 8 లో కూడా టాప్ 5 కాదు టాప్ 6 ఉంటారని తెలుస్తోంది. ఎందుకంటే ఆదివారం పృథ్వీ హౌస్ నుంచి బయటకు రావడంతో ఇంకా హౌస్ లో నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణు ప్రియ, గౌతం, అవినాష్, రోహిణిలు ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే తర్వాత వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే తర్వాత వారం ఎవరైతే వెళ్తారో వారు తప్ప మిగతా అంతా కూడా ఫైనలిస్ట్ అన్నట్టే లెక్క.
Read Also:Pawan Kalyan: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ!
దీనిని బట్టి అందరు టాప్ 5 అనుకున్న బజ్ కాస్త ఇప్పుడు టాప్ 6 కి మారిపోయింది. ఇక ఈ సీజన్ చివరి ఎలిమినేషన్ ఎవరు అవుతారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అవినాష్ ఆల్రెడీ మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి అతను కాకుండా ఉన్న వారిలో రోహిణి, ప్రేరణ, విష్ణు ప్రియ, నబీల్ వీరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఐతే అది ఎవరన్నది ఆడియన్స్ వేసే ఓట్లను బట్టి ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ 5 కాదు టాప్ 6 అని తెలిసి ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ చివరి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లే ఆ కంటెస్టెంట్ ఎవరు అనేది చూడాలి. ఐతే చివరి వారం కాబట్టి హౌస్ లో అందరు కూడా తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఎలాగైనా టాప్ 6 కి వెళ్లాలని అందరు అనుకుంటారు. సీజన్ 8 లో ఫైనల్ వీక్ కి ఎవరెవరు ఉంటారన్నది త్వరలో తెలుస్తుంది. ఐతే ఆల్రెడీ నిఖిల్, గౌతమ్ లు టైటిల్ రేసులో ఉన్నారు. అవినాష్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యాడు. కాబట్టి ఈ ముగ్గురు కాకుండా మిగిలిన నలుగురిలోనే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందనేది ఖాయం. ఈ సీజన్ చివరి వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ మొదటి నుంచి ఆట ఆడుతున్న వారు అవుతారా.. లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకరు అవుతారా అన్నది చూడాలి.
Read Also:Telangana Honour Killing: తెలంగాణలో మరో పరువు హత్య.. లేడీ కానిస్టేబుల్ను నరికి చంపిన తమ్ముడు