Site icon NTV Telugu

Ratika Rose: నక్క తోక తొక్కిన బిగ్ బాస్ బ్యూటీ.. ఆ హీరో సినిమా ఛాన్స్..

Rathika (2)

Rathika (2)

రతికా రోజ్.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరేమో.. ఒకప్పుడు సినిమాల్లో మెరిసిన కూడా అంతగా గుర్తింపు రాలేదు కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నాక యూత్ క్రష్ గా మారిపోయింది.. ఆమెను మళ్లీ మళ్లీ స్క్రీన్ మీద చూడాలని యూత్ కోరుకుంటున్నారు.. బిగ్ బాస్ లో అందాలతో పాటుగా లవ్ ట్రాక్ కూడా నడిపింది.. అదే సీజన్ కు హైలెట్ అయ్యింది.. అలాగే తను చేసే పనులతో పలువురిని ఇబ్బంది పెడుతూ త్వరగా ఎలిమినేట్ అయిపోయింది.

కానీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి అదిరిపోయే అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.. ఆ మధ్య బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో కనిపించిన ఈ అమ్మడు మంచి పేరును సంపాదించుకుంది.. ఆ తర్వాత రెండు పెద్ద సినిమాల్లో ఛాన్సులు కొట్టేసిందని చెప్పిన ఈ బ్యూటీ తాజాగా ఓ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది.. అవి స్టార్ హీరో సినిమాలే కావడం విశేషం..

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కాంట్రవర్శిలకు కేరాఫ్ గా మారింది.. పల్లవి ప్రశాంత్ తో ప్రేమ అని నమ్మించి చివరకు స్నేహం అని చెప్పింది. దాంతో బాగా నెగిటివిటిని సంపాదించుకుంది.. బయటకు వచ్చిన తర్వాత తన నెగెటివిటీ చూసుకుని భయపడిన రతిక మళ్ళీ హౌస్ లోకి రియంట్రి ఇచ్చి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించింది.. కానీ మళ్లీ విన్నర్ గా నిల్వలేక పోయింది.. కానీ వరుస సినిమా అవకాశాలను మాత్రం అందుకుంటూ వస్తుంది. తాజాగా తమిళ్ సార్ హీరో విజయ్ దళపతి మూవీలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాలిసిందే..

Exit mobile version