Site icon NTV Telugu

Bigg Boss 9 Telugu: కెప్టెన్సీ ఫైనల్ వార్.. హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ

Bigg Boss9

Bigg Boss9

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఎండింగ్ కి వచ్చింది. ఈ వారం (12వ వారం) చివరి కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందులో హౌస్‌ మేట్స్, మాజీ కంటెస్టెంట్లతో కంటెండర్ షిప్ కోసం పోటీ పడుతున్నారు. మొదట గౌతమ్ కృష్ణ హౌస్‌లో ప్రవేశించి, భరణితో పోటీ చేసి గెలిచాడు. ఈ వారంలో డీమాన్ పవన్ పై ట్రోల్స్ తీవ్రంగా పెరుగుతున్నాయి. సామాజిక మాధ్యమంలో నెటిజన్లు అతని ప్రవర్తనను ప్రశ్నిస్తున్నారు, ముఖ్యంగా కళ్యాణ్‌తో గొడవలో అతను కళ్యాణ్ మెడను పట్టుకున్న కారణంగా.. “అమ్మాయి కోసం ఎందుకు గొడవ పడ్డావ్?” అని నెటిజన్లు ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ గొడవ అతని ఇమేజ్‌పై ప్రభావం చూపేలా ఉంది.

Also Read : Prasanth Varma: నా మూవీ రిలీజ్ డేట్‌ను నేనే డిసైడ్ చేస్తా..

ఓటింగ్ ఫలితాలు చూస్తే..తనూజ 1వ స్థానం,కళ్యాణ్ 2వ స్థానం,ఇమ్మాన్యుయేల్ 3వ స్థానం,సంజన 4వ స్థానం,డీ మాన్ పవన్,5వ స్థానం,సుమన్ శెట్టి 6వ స్థానం,భరణి 7వ స్థానం,దివ్య నిఖిత,8వ స్థానంలో ఉన్నారు. ఇక హౌస్‌లో చివరి వారాలకి ఈ వారం పెద్ద ఎమోషనల్ సన్నివేశాలు ఏర్పడ్డాయి. తనూజ్, కళ్యాణ్, ఇమ్యాన్యుయేల్ తాము గేమ్‌కి ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తూ ఉన్నారు. అయితే డీమాన్ పవన్, సుమన్, భరణి, దివ్య లు డేంజర్ జోన్ లో ఉండటం, ఎలిమినేషన్ కోసం ఫ్రస్ గా ఉంటుందని సూచిస్తోంది. మొత్తానికి, 12వ వారం కెప్టెన్సీ టాస్క్ హౌస్‌లోని సన్నివేశాలు మొత్తం గేమ్ దిశని మార్చేసినట్టు ఉంది. ఈ ఫలితాలు, మాజీ కంటెస్టెంట్ ఎంట్రీ తో కలిసి, చివరి వారాల ఉత్కంఠను మరింత పెంచాయి.

Exit mobile version