Bigg Boss 8 Telugu Elimination: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రోజురోజుకు కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతున్న విషయం అర్థమవుతుంది. షో మొదలైనప్పటి నుంచి నాలుగు వారాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఐదవ వారంలో నామినేషన్ పూర్తయిన తర్వాత హౌస్ నుండి ఎవరు వెళ్తున్నారనేది మాత్రం హాట్ టాపిక్ మారింది. అయితే., ఎప్పటిలా కాకుండా ఈసారి మీకు వీక్ లో కూడా ఎఫెక్షన్ ద్వారా ఒకరు ఎలిమినేట్ అవుతారని ఇదివరకే హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్లో తెలియజేశారు. ఇకపోతే ఐదో వారం ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ మేట్స్ నాగమణికంఠ, విష్ణు ప్రియ, నైనిక, నబిల్, ఆదిత్య ఓం నిఖిల్ మొత్తం 6 మంది ఉన్నారు. వీరిలో ఒకరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అవుతుండగా.. మరొకరు సాధారణ ఎలిమినేషన్ ఆదివారం రోజు జరగనుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ కాస్త ప్రజలకు బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతుంది.
Basara Dasara: ముస్తాబైన ‘బాసర’.. నేడు శైలపుత్రి అలంకరణలో అమ్మవారు
ఇక ఎలిమినేషన్ లో భాగంగా ఓటింగ్ ప్రక్రియ ఓవైపు జరుగుతుండగా.. ప్రస్తుతం ఆదిత్య ఓం, నైనిక లకి తక్కువ ఓటింగ్ వస్తున్నట్లు కనపడుతుంది. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లే అనుకోవచ్చు. అయితే సమాచారం మేరకు ప్రకారం., ఆదిత్య ఓం మిడ్ వీక్ లో ఎలిమినేట్ అవుతుండగా.. నైనిక ఆదివారం రోజున బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వస్తుందని ఊహగానాలు ఎక్కువగా వినబడుతున్నాయి. వీరిద్దరూ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉండబోతున్నట్లు సమాచారం.
Amala Akkineni : మీ నేతలను అదుపులో ఉంచుకోండి రాహుల్ గాంధీ: అమల
ఇది ఇలా ఉండగా.. సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్ లో ఉండే కాంటెస్ట్ విషయంలో పెద్ద చర్చనే జరిగింది. ముక్కు, మొహం తెలియని కంటెస్టెంట్స్ ను తీసుకోవచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ముఖ్యంగా కన్నడ నేపథ్యం ఉన్న సీరియల్ ఆర్టిస్టులను ఎక్కువమంది తీసుకోవడంతో ఈ వాదన మరీ ఎక్కువగా వినపడింది. ఇక ఐదవ వారం ఎలిమినేషన్ లో భాగంగా ప్రస్తుతం నబిల్, నిఖిల్ ముందు వరసలు దూసుకుపోతున్నారు. గత కొన్ని రోజులుగా తన ఆటతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుండగా.. మరోవైపు ఎనిమిదవ సీజన్ విజేత అతడే అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. విమర్శలను ఎదుర్కొంటున్న బిగ్ బాస్ ఇప్పుడు ఐదవ వారంలో కాస్త రసవత్తరంగా సాగేలా కనబడుతోంది.