Bigg Boss 8 Prithviraj Shetty: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్ స్టేజి కు రావడంతో గ్రాండ్ ఫినాలేలో చోటు కోసం నువ్వా..నేనా.. అన్నట్లుగా హౌస్ లో పోటీ జరుగుతోంది. ఇకపోతే గతవారం శనివారం ఎపిసోడ్‌లో టేస్టీ తేజ ఎలిమినేట్ కాగా ఆదివారం ఎపిసోడ్‌లో పృథ్వీరాజ్ బయటకు వచేసాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో భాగంగా వెళ్లిన ఒకడిగా వెళ్లిన టేస్టీ తేజ మొత్తానికి బయటికి వచ్చాడు. అతను హౌస్ లో ఉన్నంత వరకు బాగానే ఎంటర్టైన్ చేశా దనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక చివరకి డబుల్ ఎలిమినేషన్లలో ఒకడిగా బయటకొచ్చేశాడు టీజ. ఇక అలాగే డబుల్ ఎలిమినేషన్‌లో రెండో వ్యక్తిగా పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవుతాడని ఎవరు ఊహించలేకపోయారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటి వచ్చిన ఆయన ఎన్టీవీతో ముచ్చటించారు. ఇందులో భాగంగా అయన పలు ఆసక్తికరమైన అంశాలను చెప్పుకొచ్చాడు.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?
పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. తనకి మొదట బిగ్ బాస్ లోకి వెళ్లడం ఇష్టం లేదని.. కాకపోతే, తన స్నేహితులు బిగ్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ చాలా పెద్దదని అక్కడికి వెళ్తే మంచి అవకాశాలు వస్తాయని చెప్పడంతో తాను వచ్చినట్లు తెలిపారు. అలాగే తాను హౌస్ లోకి వెళ్లే ముందు కప్ గెలుస్తానో గెలవనో తెలియదు కానీ.. బయటికి వచ్చేసరికి తనని ప్రజలు మంచిగా ఇష్టపడితే చాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇక మొత్తానికి బిగ్ బాస్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. సీజన్ మొదలైనప్పటి నుంచి యాంకర్ విష్ణుప్రియ, పృథ్వీరాజ్ శెట్టి ప్రేమ వ్యవహారం నడుస్తూనే ఉంది. ఈ విషయం పై పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. విష్ణుప్రియ సైడు నుంచి నాపై ప్రేమ ఉన్నట్లు కనపడుతుందని, కాకపోతే.. తాను అడిగినప్పుడు ఫ్రెండ్షిపే కానీ.. అంతకుమించి అంటూ సమాధానం ఇచ్చేదని చెప్పాడు. అయితే ఆమె బిహేవియర్ చాలా బాగుంటుందని, క్యూట్ గా ఉంటుందని చెబుతూనే.. తన సైడు నుంచి మాత్రం కేవలం స్నేహం మాత్రమే అంటూ కుండబద్దలు కొట్టేసాడు. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో స్నేహితురాలేనని అలాగే బయట కూడా మంచి స్నేహితురాలు గానే కొనసాగుతుందని, తనపై ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దని చెప్పినట్లు తెలియజేశారు. అలాగే పృథ్వీరాజ్ ఇది వరకు సీరియలో నటించిన దర్శన గౌడ ప్రేమ వ్యవహారం కూడా స్పందించాడు.