NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్‌లో శ్రీలీల సందడి.. అతను అనిల్ కు జూనియరట?

Bigg Boss Sreeleela

Bigg Boss Sreeleela

బిగ్ బాస్ లో వీకెండ్ వచ్చిందంటే సందడి మాములుగా ఉండదు.. నాగ్ చేసే సందడి జనాలను ఆకట్టుకుంటే, నాగ్ హౌస్మేట్స్ కు ఇచ్చే క్లాసులు కూడా ఆసక్తి కలిగిస్తాయి.. ఇక వారం బిగ్‌బాస్ చాలా సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమోని రిలీజ్ చేసిన నిర్వాహుకులు.. తాజాగా మరో ప్రోమోని రిలీజ్ చేశారు. మొదటి ప్రోమోలో.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ దామిని, రతిక రోజ్‌, శుభ శ్రీని మళ్ళీ లోపలి తీసుకు వచ్చినట్లు చూపించారు. సెకండ్ ప్రోమోలో హీరోయిన్ శ్రీలీలని, దర్శకుడు అనిల్ రావిపూడిని గెస్ట్‌లుగా తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది..

బాలయ్య బాబు హీరోగా అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈక్రమంలోనే శ్రీలీల, అనిల్ రావిపూడి.. బిగ్‌బాస్ వేదిక పైకి వచ్చారు. ఇక ఈ ఇద్దరు హౌస్ లోని కంటెస్టెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ.. కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్ చేస్తున్నారు.. ఇక టేస్టీ తేజ అనిల్ రావిపూడి జూనియర్ అని ప్రోమోలో చూపించారు..

ఇక ఇదే ప్రోమోలో అమర్‌దీప్‌, శ్రీలీలతో పులిహోర కలిపే ప్రయత్నం చేయడం, యావర్ ‘మాస్’ సినిమాలోని నాగార్జున డైలాగ్ చెప్పడం చూపించారు. ప్రోమో అయితే మంచి ఎంటర్‌టైన్మెంట్ గా సాగింది.. ముగ్గురు అమ్మాయిలు రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రోమో లో చూపిస్తున్నారు.. మరి వాళ్లు ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది జనాలు ఆసక్తి ఎదురుచూస్తున్నారు.. అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దాని పై కూడా క్యూరియాసిటీ నెలకుంది..ఈరోజు అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
Bigg Boss Telugu 7 Promo 1 | Sreeleela and Anil Ravipudi Fun With Contestants | Nagarjuna | Star Maa