బిగ్ బాస్ సీజన్ 7 ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ ఉండటం వల్ల మరింత రసవత్తరంగా మారింది.. పవర్ అస్త్రాలను వెనక్కి తీసుకోవడంతో అందరు నువ్వా నేనా అంటూ గట్టి పోటీకి దిగారు.. నలుగురు అమ్మాయిలు ఇప్పటివరకు ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు బిగ్బాస్ ఇంట్లో కేవలం ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు.. అందులో శోభా శెట్టి ఒకరు.. ఈ సీరియల్ బ్యూటీ మొదటి నుంచి గట్టి పోటీని ఇస్తుంది.. నువ్వా నేనా అంటూ టాస్క్ లలో దూసుకుపోతుంది..
మొదట్లో అమర్ దీప్, ప్రియంకతో కేవలం స్నేహం చేస్తూ ఆట పక్కన పెట్టేసిన ఈ బ్యూటీ ఇప్పుడు గేమ్ పై ఫోకస్ చేసింది.. ఎలాగైనా ఆటలో గెలవాలని.. బిగ్ బాస్ టైటిల్ కొట్టాలని దూకుడుగా వ్యవహారిస్తుంది.. ప్రస్తుతం హౌస్ లో ఎక్కువగా గేమ్ ఆడుతున్నవారిలో శోభా ఒకరు. ముఖ్యంగా ప్రతి వారం తాను చెప్పాలనుకుంటున్న విషయాన్ని చెప్పేస్తూ గొడవలకు సైతం వెనకడుగు వేయకుండా అడియన్స్ దృష్టిని తనపై పడేలా చేస్తోంది.. ఇప్పటివరకు నామీనేషన్ లో వచ్చినా సత్తాను చాటుతుంది.. జనాలు ఆమెను హౌస్ లో ఉంచాలని కోరుకుంటున్నారు.. దాంతో ఓట్లు వేస్తూ గెలిపిస్తున్నారు..
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ అమ్మడు రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.. శోభ శెట్టి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఈమె ఒక వారం రోజులపాటు హౌస్ లో కొనసాగడం కోసం ఏకంగా 1.25 నుంచి దగ్గరదగ్గర రూ.2 లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈవారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి.. మరి ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ బయటకు వెళ్తుందా లేదా అబ్బాయి వెళతారా అనేది తెలియాలంటే రోజు బిగ్ బాస్ ను మిస్ అవ్వకుండా చూడాలి..