Site icon NTV Telugu

Bigg Boss7 Telugu : కెప్టెన్ గా యావర్…వద్దన్నా వినకుండా అమర్ హార్ట్ బ్రేక్ చేసిన తేజ..

Yavar (2)

Yavar (2)

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ లు ఏర్పడ్డాయి.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యావర్ బిగ్ బాస్ సీజన్ 7 కొత్త కెప్టెన్ గా అవతరించాడు.. ఎన్నో జరిగిన తర్వాత యావర్ కు కెప్టెన్సీ దక్కింది.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో వంట గదిలో మళ్లీ గొడవ జరిగింది.. ఫుడ్ అందరికీ సరిపోలేదని ప్రియాంక, యావర్ మధ్య మాటల యుద్ధం జరిగింది.. ప్రియాంక తానూ కిచెన్ లో ఇంత కష్టపడుతున్నప్పటికీ ఇలాంటి మాటలు, అవమానాలు తప్పడం లేదని కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది..

అనంతరం బిగ్ బాస్ ఆటగాళ్లు పోటుగాళ్ళు మధ్య గేమ్స్ కొనసాగించారు. గోల్ వేసే టాస్క్ లో ఇరు టీమ్స్ నుంచి నలుగురేసి సభ్యులు పాల్గొన్నారు. ఈ గోల్ ఫైట్ ఇరు టీమ్స్ మధ్య భీకర పోరు జరిగింది. ఇటువైపు యావర్, అటువైపు అర్జున్ ఇద్దరూ చెమటలు చిందించారు.. మొత్తానికి ఆటగాళ్లు విజయం సాధించారు. ఎక్కువ గేమ్స్ లో ఆటగాళ్లు విజయం సాధించారు కాబట్టి కెప్టెన్సీ అవకాశం వారికే దక్కుతుంది అని బిగ్ బాస్ ప్రకటించారు. దీనితో కెప్టెన్సీ కోసం ఆటగాళ్లు పోటీ పడ్డారు. అయితే కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. ఆటగాళ్లందరికి బెలూన్స్ కట్టారు.. వారి బెలూన్స్ ను వాళ్లు కాపాడుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు..

ఇక చివరగా యావర్, అమర్ దీప్ ఉన్నారు. అమర్ దీప్ కొంచెం ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అంటూ బతిమాలుకున్నాడు. కానీ తేజ ఊహించని విధంగా అమర్ దీప్ బెలూన్ ని పగలగొట్టారు. దీనితో అమర్ దీప్ తనకి ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది.. చివరగా మిగిలింది తేజ, యావర్ మాత్రమే. ఆ సమయంలో బిగ్ బాస్ ఆసక్తికర ప్రకటన చేశారు. నెక్స్ట్ బజర్ మోగినప్పుడు పోటుగాళ్ళు టీంలో ఒకరు సూదిని దక్కించుకోవాలి. సూది దక్కించుకున్నవారు ఇంకెవరితో డిస్కస్ చేయకుండా ఒకరి బెలూన్ పగలగొట్టి ఇంకొకరిని కెప్టెన్ చేయాలి అని ప్రకటించారు. బజర్ మోగగానే నయని పావని సూది దక్కించుకుంది. వెంటనే వెళ్లి తేజ బెలూన్ గుచ్చింది… అలా యావర్ కెప్టెన్ గా అయ్యాడు..

Exit mobile version