Site icon NTV Telugu

VJ Sunny: సెలూన్ బిజినెస్‌లోకి బిగ్ బాస్ విన్నర్.. గ్రాండ్‌గా ఓపెనింగ్..

Vj Sunny

Vj Sunny

VJ Sunny : ప్రముఖ నటుడు, తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విజేత విజే సన్నీ తాజాగా తన కలను సాకారం చేసుకుంటూ ” బార్బర్ క్లబ్ ” అంటూ సెలూన్ మొదలుపెట్టేసాడు. హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ లో ఆదివారం నాడు ఈ సెలూన్ ఓపెనింగ్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ” ది బార్బర్ క్లబ్ ” సెలూన్ ను మొదటగా ప్రవేశపెట్టిన జోర్డాన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్బంగా అతనికి హారతి ఇచ్చి మరి ఘన స్వాగతం పలికారు. వీరితోపాటు టాలీవుడ్ నటులలో హీరో శ్రీకాంత్, తరుణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్స్ సోహెల్, మానస్, ఆర్జే కాజల్, దీప్తి సునయన లాంటి కొందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Uttar Pradesh : భర్త వేరే కలర్ లిప్ స్టిక్ తెచ్చాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సన్నీకి అనేకమంది అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా విజే సన్నీ మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సెలూన్ తెరిచే ఉంటుందని తెలిపారు. అలాగే తమ బిజినెస్ ఆదరించాలని ఆయన కోరారు. ఇక ఈ సందర్భాన్ని పునస్కరించుకొని ఫోటోలను షేర్ చేసిన సన్నీకి అభిమానులు కంగ్రాట్స్ అంటూ పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. మరికొందరైతే.. నువ్వు బిగ్ బాస్ హౌస్ లో చెప్పినట్లుగానే నీ కలను సాధించుకున్నావు.. మరికొన్ని మైలురాళ్లను అందుకోవాలని వారు శుభాకాంక్షలు తెలిపారు.

Mount Everest: స్వర్గలోకం ఇదే కాబోలు.. మౌంట్ ఎవరెస్ట్‌ అందాలు అదరహో.. (వీడియో)

ఇదివరకు ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో విజే సన్నీ మొదటగా యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించి.. ఆ తర్వాత నటుడిగా ప్రస్తానాన్ని కొనసాగించాడు. జీ తెలుగు బుల్లితెరలో కళ్యాణ వైభోగమే సీరియల్ లో తన నటనకు మంచి పేరు వచ్చింది. ఇదే క్రేజ్ ను ఉపయోగించుకుని బిగ్ బాస్ 5వ సీజన్లో కన్సిస్టెంట్ గా అడుగుపెట్టి మొత్తానికి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని టాలీవుడ్ సినిమాలలో కూడా హీరోగా నటించాడు. అంతేకాదు సన్నీ నటించిన ఏటీఎం వెబ్ సిరీస్ కూడా మంచి ఆదరణ లభించింది.

Exit mobile version