NTV Telugu Site icon

TGPSC: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అప్‌డేట్..

Tgpsc Group 4 Certificate Verification

Tgpsc Group 4 Certificate Verification

తెలంగాణ‌ గ్రూప్‌-3 అభ్యర్థుల‌కు టీజీపీఎస్సీ (తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌) బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో ప‌రీక్షలు నిర్వహిస్తామ‌ని చెప్పిన బోర్డు.. తాజాగా షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. కాగా.. ఎగ్జామ్స్‌కు వారం రోజుల ముందు హాల్ టికెట్లను విడుదల చేస్తామని పేర్కొంది. మరోవైపు.. మోడ‌ల్ ఆన్సర్ బుక్‌లెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన‌ట్లు తెలిపింది. మొత్తం 1388 గ్రూప్‌-3 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం.. రాష్ట్రంలో దాదాపు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీలను టీజీపీఎస్‌సీ ప్రకటించింది.

Read Also: YS Jagan: తెలుగు రాష్ట్ర ప్రజలకు వైసీపీ అధినేత విజయ దశమి శుభాకాంక్షలు..

గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో భాగంగా మొదటగా 2022 డిసెంబర్ 30న 1363 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. తర్వాత.. మరో 13 పోస్టులు చేర్చారు. బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులను అదనంగా చేర్చడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1375కి పెరిగింది. అనంతరం నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో.. మరోసారి 13 పోస్టులు కలపింది. దీంతో.. మొత్తం కొలువుల సంఖ్య 1388కి పెరిగాయి.

Read Also: Nara Lokesh Praja Darbar: 41వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్.. అండగా ఉంటానని హామీ

Show comments