Site icon NTV Telugu

Railway track Broken: విరిగిన రైలు పట్టా.. ఏపీలో తప్పిన భారీ ప్రమాదం

Railway Track Broken

Railway Track Broken

Railway track Broken: ఈ మధ్య వరుసగా రైలు ప్రమాదాలు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది.. తిరుపతి జిల్లా పూతలపట్టు మండలంలో రైలు పట్టా విరిగింది.. అయితే, ముందుగా రైలు పట్టా విరిగినట్టు గ్యాంగ్ మేన్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది.. విరిగిన పట్టాను గమనించి.. దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చాడు గ్యాంగ్‌మెన్‌.. దీంతో.. రామేశ్వరం నుంచి వస్తున్న రైలును నిలిపివేశారు అధికారులు.. మరమ్మతులు చేసి యథావిథిగా రైళ్లను నడుపుతున్నారు.. రైలు పట్టా మరమ్మతుల కారణంగా 10 నిమిషాలు ఆలస్యంగా పాకాలకు చేరుకుంది రైలు.. ప్రస్తుతానికి ఆ రైట్‌లో రైళ్ల రాకపోకలు యథావిథిగా కొనసాగుతున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.

 

 

 

Exit mobile version