Site icon NTV Telugu

Ajith Kumar : అజిత్ ముందు బిగ్ టార్గెట్స్.. రీచ్ అయ్యేనా..?

Ajith

Ajith

బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టేందుకు విదాముయార్చితో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడుతున్నా అజిత్ కు రూ. 200 క్రోర్ ప్లస్ కలెక్షన్స్ అందని ద్రాక్షల మారాయి. కాంపిటీటర్స్ కమల్, రజనీ, విజయ్ సినిమాలు రూ. 300 క్రోర్ అవలీలగా దాటేస్తున్నాయి. రజనీకాంత్ లాంటి హీరో ఐతే ఈ వయసులో కూడా రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు కోలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్లో ఆయనవే టాప్ ప్లేస్ లో ఉన్నాయి.

Also Read : Masthan Sai : మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు.. డ్రగ్స్ ఇచ్చి, వీడియోలు తీసి..

నిన్న మొన్న వచ్చిన శివ కార్తికేయన్ కూడా అమరన్ తో రూ. 300 క్రోర్ క్లబ్ లోకి చేరిపోయాడు. కానీ అజిత్ రూ. 200 క్రోర్స్ చూడటానికి నానా అవస్తలు పడుతున్నాడు. ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్నా మార్కెట్ పెద్దదైనా, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నా ఈ మార్క్ అందుకోవడంలో విఫలమౌతున్నాడు. ఈ లెక్కన చూస్తే ‘తల’ ముందు బిగ్ టార్గెట్స్ ఉన్నాయి. ప్రజెంట్ విదాముయార్చి ప్రీ బుకింగ్స్ చూస్తుంటే రూ. 200 క్రోర్ కలెక్ట్ చేయడం పక్కా అని పిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. ఐతే ఇప్పుడు అజిత్ ముందు రూ. 300 క్రోర్స్ టార్గెట్ ఎదురుచూస్తుంది. తనివు, విశ్వాసంతో రూ. 200 క్రోర్ సమీపానికి వచ్చిన అజిత్ కు ఇదేమీ పెద్ద టార్గెట్ కాదు. తనకు అసలు సిసలైన కాంపిటీటర్ విజయ్ గోట్ కలెక్షన్స్ టచ్ చేయాలి. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ రూ. 400 కోట్లు కొల్లగొట్టాడు ఇళయ తలపతి. సినిమా టాక్ బాగుంటే అజిత్ ఇవే కాదు కొత్త రికార్డ్స్ సృష్టించగలడు. మరీ విదాముయర్చి అజిత్ ఫ్యాన్స్ కాలరెగరేసే సినిమా అవుతుందో లేదో చూడాలి

Exit mobile version