Site icon NTV Telugu

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్.. పవర్ స్టార్ డబ్బింగ్ టీజర్ కోసమేనా..?

Whatsapp Image 2024 03 17 At 1.58.11 Pm

Whatsapp Image 2024 03 17 At 1.58.11 Pm

దేశవ్యాప్తంగా ఎన్నికల నగార మోగింది.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైంది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలారోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనే పర్యటిస్తూ.. సభలు ఏర్పాటు చేస్తూ.. పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో  ఆయన  అప్ కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరపైకి వచ్చింది. ఒక్కసారిగా ఈ మూవీ నుండి అప్డేట్ ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. అంతే కాకుండా తాజాగా పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలను కూడా విడుదల చేసి మరో అప్డేట్ కోసం ఎదురుచూడమంటూ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచాడు.హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబినేషన్లో చాలా ఏళ్ల క్రితం వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న  పవన్ కల్యాణ్ ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించింది. పవన్ కల్యాణ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది.అప్పటినుండి హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కలిసి మళ్లీ ఎప్పుడెప్పుడు మూవీ చేస్తారా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూశారు.

ఫైనల్ గా వీరిద్దరి కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ దీని అనౌన్స్మెంట్ వచ్చి, షూటింగ్ మొదలయినప్పటి నుండి ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. వరుసగా సినిమాలను ఒప్పుకొని షూటింగ్ ప్రారంభించిన తర్వాత పవన్.. పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు పెద్ద బ్రేక్ పడింది. ఇన్నాళ్లకు దీని నుండి ఒక అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.
‘మీరు ఊహించనిది జరగబోతుంది. మార్చి 19’ అంటూ పవన్ కల్యాణ్ చెప్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను మైత్రీ మూవీ మేకర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీంతో ఈ నిర్మాణ సంస్థ షేర్ చేసిన ఫోటోలు, అందించిన అప్డేట్ చూసి మార్చి 19న మూవీ టీజర్ విడుదల కానుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు సంబంధించిన ఒక గ్లింప్స్ చాలాకాలం క్రితమే రిలీజ్ అయ్యింది.. కాబట్టి ఇప్పుడు వచ్చేది టీజరే అని సోషల్ మీడియాలో చర్చలు కూడా మొదలయ్యాయి.

Exit mobile version