Big Sea Snake washes up on Australia Sunshine Beach: ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లోని సన్‌షైన్ బీచ్ నుంచి ఇటీవల అత్యంత విషపూరితమైన, భారీ సముద్రపు పాము కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. బీచ్‌లలో ఏదైనా సముద్రపు పాముని చూసినట్లయితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని.. దానిని పట్టుకోవడానికి కానీ, దగ్గరకు వెళ్లడానికి అస్సలు ప్రయత్నించొద్దని వారు హెచ్చరించారు. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
భారీ సముద్రపు పాము కోసం సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ 24 గంటలు వెతుకుతున్నారట. ‘సన్‌షైన్ బీచ్‌లో పెద్ద సముద్రపు పాము కొట్టుకుపోయింది. మీరు బీచ్‌లలో ఏదైనా సముద్రపు పాముని చూసినట్లయితే దయచేసి స్థానిక రెస్క్యూ బృందానికి సమాచారం ఇవ్వండి. బీచ్ నుంచి అది కొట్టుకుపోయిందంటే.. అది అనారోగ్యం లేదా గాయపడిందని అర్థం. ఆ పాముకి ఇప్పుడు చికిత్స అవసరం. పామును పట్టుకుని తిరిగి సముద్రంలో వేయడానికి ప్రయత్నించవద్దు. సముద్రపు పాములు చాలా విషపూరితమైనవి. పాము కనిపిస్తే ఈ 0409536000 నంబర్‌కి కాల్ చేయండి’ అని సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ ఓ ప్రకటన చేశారు.
Also Read: Plane Crash: కుప్పకూలిన విమానం.. ఐదుగురు రాజకీయ నాయకులు మృతి!
సముద్రపు పాముకి సంబందించిన ఫొటో నెట్టింట చక్కర్లు కొట్టడంతో సన్‌షైన్ బీచ్ చుట్టుపక్కల నివాసితులు భయపడుతున్నారు. మరోవైపు పాము ఫొటోను చూసి కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. భారీ పాము, చాలా వింతగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ బీచ్‌లో వింత (మిస్టీరియస్) వస్తువు ఒకటి ప్రత్యక్షమైంది. సిలిండర్ మాదిరి ఉన్న ఆ వస్తువుని చూసి అక్కడి జనాలు ఆశ్చర్యపోయారు.