ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా సర్వైవ్ కావడం చాలా కష్టం. అందులోనూ బాలీవుడ్ లో. కానీ టాలెంట్ ఉండాలే కానీ గాడ్ ఫాదర్ ఉండక్కర్లేదని ఫ్రూవ్ చేశాడు కార్తీక్ ఆర్యన్. డిఫరెంట్ స్టోరీలతో, వెర్సటైల్ యాక్టింగ్ స్కిల్ తో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అందుకే గతంలో హీరోకు నో చెప్పిన నిర్మాణ సంస్థే ఇప్పుడు వరుసగా ఆఫర్లు ఇచ్చి గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుంటోంది. అదే బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ధర్మ. గతంలో ఈ హీరోతో దోస్తానా 2 చేయాల్సి ఉండగా క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు కార్తీక్ ఆర్యన్.
Also Read : Mohanlal : మలయాళ సినిమా రికార్డులు తిరగరాస్తున్న మోహన్ లాల్ అండ్ సన్
ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు కార్తీక్. భూల్ భూలయ్యా3 హిట్టుతో హీరో రేంజ్ మారిపోయింది. అందుకే కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తుంది. తు మేరీ మే తేరా మే తేరా తు మేరీ, నాగ్జిల్లా టూ డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంట్ చిత్రాలు చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన తుమేరా డిసెంబర్ 25న రిలీజ్ అవుతుంది. అలాగే రీసెంట్లీ స్టార్టైన నాగ్జిల్లా అడ్వెంజర్ కామెడీ మూవీగా రూపుదిద్దుకుంటోంది. ఇది నెక్ట్స్ ఇయర్ ఆగస్టుకు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే సినిమా సినిమాకు మస్త్ షేడ్స్ చూపిస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. చందు చాంపియన్ కోసం మేకోవరైన స్టార్ హీరో భూల్ భూలయ్యా 3 కోసం నార్మల్ లుక్కులోకి వచ్చేశాడు. అలాగే అనురాగ్ బసు దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న మ్యూజికల్ లవ్ స్టోరీలో అమర ప్రేమికుడిగా కనిపించాడు. నెక్ట్స్ ఇక నాగ్జిల్లా కోసం కూడా మేకోవర్ కాబోతున్నాడన్నది టాక్.
