Site icon NTV Telugu

Coronavirus: కరోనా వైరస్ పట్ల తక్షణ అప్రమత్తం.. ఆరోగ్యశాఖ సూచనలు జారీ!

Coronavirus

Coronavirus

మహమ్మారి కరోనా వైరస్‌పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బిగ్ అలెర్ట్ ఇచ్చింది. అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తోంది. తలనొప్పి, జ్వరం, దగ్గు, నీరసం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది. మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడండని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మరలా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

Also Read: Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాల తనిఖీలు.. ఎమ్మెల్యే పర్యటనలు రద్దు!

కరోనా వైరస్‌ నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ప్రార్ధన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాల వంటి వాయిదా వేసుకోవాలని కోరింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలి. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కావడం లేదా ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. ఆరోగ్యశాఖ అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన 24 గంటలు పని చేసే ల్యాబ్ లు ఉన్నాయి. మాస్కులు, పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version