Site icon NTV Telugu

Swati maliwal case: బిభవ్ కుమార్‌‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ

Keke

Keke

రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. మే 13న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై బిభవ్ భౌతికదాడికి తెగబడ్డారు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇక ఆయన వేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సోమవారం కోర్టు తిరస్కరించింది. బిభవ్‌ను విడుదల చేస్తే ప్రాణహాని ఉంటుందని మాలివాల్ పేర్కొనడంతో బిభవ్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

ఇది కూడా చదవండి: Mount Everest: ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జాం..గత వారంలో 5 గురు అధిరోహకులు మృతి

ఇక కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు.. పబ్లిక్ ప్రాసిక్యూటర్.. జడ్జి ఛాంబర్‌లో గంట పాటు ఉన్నారని బిభవ్ కుమార్ న్యాయవాది ఆరోపించారు. న్యాయమూర్తి దగ్గర ఉండాల్సిన అవసరం ఏముందని… తీస్ హజారీ కోర్టులో తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయమూర్తితో చర్చలు తర్వాతే ఈ విధనాన్ని తీర్పు వచ్చిందని బిభవ్ న్యాయవాది ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Smoking: సిగరెట్ తాగే అమ్మాయిల సంఖ్య రెట్టింపు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడి

మే 13న స్వాతి మాలివాల్.. కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. ఆ సమయంలో బిభవ్ వచ్చి.. ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపరిచారు. మొత్తానికి నాలుగు రోజుల తర్వాత.. బిభవ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Smoking: సిగరెట్ తాగే అమ్మాయిల సంఖ్య రెట్టింపు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడి

Exit mobile version