Site icon NTV Telugu

Swati Maliwal case: కోర్టులో బిభవ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్.. కాసేపట్లో విచారణ

Bibhav Kumar

Bibhav Kumar

రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టనుంది.

ఇది కూడా చదవండి: Palnadu: పల్నాడు కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేష్ బాలాజీ నియామకం.. ఈసీ ఉత్తర్వులు

ఇదిలా ఉంటే స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌ను శనివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. సోమవారం కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై బిభవ్ కుమార్ భౌతికదాడికి తెగబడ్డారు. దీంతో ఆయనపై గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎక్కడెక్కడ దాడి చేశాడో.. స్వాతి మాలివాల్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..

సోమవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలిసేందుకు స్వాతి మాలివాల్… సీఎం నివాసానికి వచ్చింది. సిబ్బంది డ్రాయింగ్ రూమ్‌లో వెయిట్ చేయమని చెప్పడంతో కేజ్రీవాల్ రాక కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో ఆకస్మాత్తుగా బిభవ్ కుమార్‌ రావడం.. పెద్దగా అరుపులు అరవడం.. దుర్భాషలాడారు. ఈ హఠాత్తు పరిణామంతో ఆమె షాక్‌కు గురైంది. అంతే మెరుపు వేగంతో స్వాతి మాలివాల్‌పై దాడికి తెగబడ్డారు. తను రుతుక్రమంలో ఉన్నానని బతిమాలినా పట్టించుకోకుండా దాడి చేశాడు. సాయం చేయమని వేడుకున్నా.. సిబ్బంది చూస్తూనే ఉన్నారు కానీ.. ఎవరు రక్షించే ప్రయత్నం చేయలేదు. మొత్తానికి ఎలాగోలా బయటపడి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చేలోపే స్వాతి మాలివాల్‌ను సిబ్బంది బయటకు పంపేశారు. తాజాగా విడుదలైన వీడియోలో ఈ దృశ్యాలు కనిపించాయి.

ఇది కూడా చదవండి: Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో భారత, పాకిస్తాన్ విద్యార్థులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి..?

స్వాతి మాలివాల్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో బిభవ్ కుమార్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎక్కడెక్కడ దాడి చేశాడో అవన్నీ ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. అలాగే మెడికల్ రిపోర్టులో కూడా ఆమెపై దాడి జరిగినట్లుగా తేలింది. శనివారం మధ్యాహ్నం బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు విచారించనున్నారు. ఇక జాతీయ మహిళా కమిషన్ రెండు సార్లు నోటీసులు ఇచ్చింది. కానీ బిభవ్ కుమార్ స్పందించలేదు.

మరోవైపు ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కేజ్రీవాల్ స్పందించకపోవడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: DK Shivakumar: ప్రధాని మోడీ పరువు తీసేందుకు డీకే శివకుమార్ రూ. 100 కోట్లు ఆఫర్ చేశాడు: బీజేపీ నేత..

Exit mobile version