Site icon NTV Telugu

Swati maliwal case: బిభవ్ కుమార్‌కు ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Bibhav Kumar

Bibhav Kumar

రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ కేసులో సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగలింది. ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అరెస్ట్ తర్వాత ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. అదనపు సెషన్స్ జడ్జి సుశీల్ అనుజ్ త్యాగి ఈ పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో బిభవ్ కుమార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD: బుజ్జి బుజ్జి బుజ్జి.. అసలు ఎవర్రా ఈ బుజ్జి..?

బిభవ్ కుమార్‌ను సాయంత్రం 4:15 గంటలకు అరెస్ట్ చేసినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ న్యాయమూర్తికి తెలియజేశారు. అనంతరం పిటిషన్‌ను కొట్టివేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని బిభవ్ కుమార్ తరపు న్యాయవాది హరిహరన్ కోర్టుకు చెప్పారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి వచ్చి బిభవ్ కుమార్‌ను తీసుకెళ్లారని.. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టేషన్‌లోనే ఉన్నారని తెలిపారు. నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేసినందుకు బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

ఇది కూడా చదవండి: Jagapathi Babu : జపాన్ లో జగ్గూ భాయ్ క్రేజ్ మాములుగా లేదుగా..

ఇదిలా ఉంటే ఈరోజే బిభవ్ కుమార్‌ను కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. అలాగే పోలీస్ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని పోలీసులు కోరనున్నారు. సీఎం నివాసంలో క్రైమ్ సీన్ జరగడానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌ను శనివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. సోమవారం కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై బిభవ్ కుమార్ భౌతికదాడికి తెగబడ్డారు. దీంతో ఆయనపై గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎక్కడెక్కడ దాడి చేశాడో.. స్వాతి మాలివాల్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: IPL 2024: ధోనీతో కలిసి ఆడటం ఇదే చివరి మ్యాచ్..! కోహ్లీ కీలక వ్యాఖ్యలు

Exit mobile version