Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లిలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కార్యాలయానికి సహ ఉద్యోగి రాకపోవడంతో ఆబ్సంట్ వేసిన ఉన్నతాధికారిపై చేయిచేసుకున్న ఘటన సంచనంగా మారింది. అయితే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండటం గమనార్హం.
అయితే.. ఈనెల 17,18న ఎలాంటి సమాచారం లేకుండా విధులకు ఏడీఏ శ్రీధర్ హాజరు కాలేదు. దీంతో పై అధికారి డీఏఓ విజయ్‌భాస్కర్.. శ్రీధర్ గురించి ఆరా తీయగా సహ ఉద్యోగులు తెలియదు అంటూ సమాధానం చెప్పారు. ఈనేపథ్యంలో డీఏఓ విజయ్ .. శ్రీధర్ ఆ రెండు రోజులు ఆబ్సెంట్ వేశాడు. అయితే శ్రీధర్ నిన్న (శుక్రవారం) విధులకు హాజరయ్యాడు. రోజూలేగానే రిజిస్టార్ లో సైన్ పెట్టేందుకు వెళ్లాడు. అయితే 17,18న తనకు ఆబ్సెంట్ వేసింది కనిపించింది. దీంతో రగిలిపోయిన శ్రీధర్ నాకు ఎవరు ఆబ్సెంట్ వేసింది అంటూ ప్రశ్నించారు. డీఏఓ విజయ్ అని చెప్పడంతో కోపంతో శ్రీధర్ ఆయన దగ్గరకు వెళ్లాడు. నాకే ఆబ్సెంట్ వేస్తావా అంటూ నీ అంతు చూస్తా అంటూ దాడి చేశాడు. అంతేకాకుండా డీఏఓ విజయ్ పై చేయిచేసుకున్నాడు. సహ ఉద్యోగులు శ్రీధర్ ను బయటకు లాక్కుని వచ్చారు. దీంతో గొడవ కాస్త తగ్గినా శ్రీధర్ మాత్రం విజయ్ పై కోపంతో నీ అంతు చూస్తా అంటూ బెదిరించాడని తోటి ఉద్యోగులు తెలిపారు.
Read also: Train derail: కేరళలో పట్టాలు తప్పిన కన్నూర్-అలప్పుజ ఎక్స్‌ప్రెస్ ట్రైన్..
అయితే డీఏఓ విజయ్ మాట్లాడుతూ.. ఏడీఏ ఎలాంటి సమాచారం లేకుండా, లీవ్ పెట్టకుండా.. ఆఫీసుకు హాజరుకాకపోతే ఆబ్సెంట్ వేసే అధికారం తనకు ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా.. తన ఛాంబర్‌లోకి వచ్చి ఒక్కసారిగా చేయి చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారన్నారు తెలిపారు. ఏడీఏపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా సరెండర్ చేయమని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. శ్రీధర్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయనున్నట్లు తెలిపారు. అయితే మరోవైపు దాడి విషయమై ఏడీఏ శ్రీధర్ మాట్లాడుతూ తాను సెలవు పెట్టానని, ఆ లేఖను ఆఫీసులో ఇచ్చినట్లు చెప్పారు. అంతే కాకుండా.. డీఏఓను తాను కొట్టలేదని తెలిపాడు. డీఏఓ తనపై దుర్భాషలాడారని చెప్పారు. తనపై డీఏఓ కు కక్ష ఉందని.. అది సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు వెల్లడించారు.
North korean : వీడియో చూసినందుకు 12ఏళ్ల జైలు శిక్ష