Site icon NTV Telugu

Bhumana Karunakar Reddy: జగన్ అంటే జనం.. నేటి జన ప్రవాహం కూటమి ఓటమి ఖరారు చేసింది!

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

వైఎస్ జగన్ అంటేనే జనం అని, ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. మామిడి రైతుల్లో భరోసా నింపడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మేలు చేయడానికి జగన్ బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డుకు వచ్చారన్నారు. దేశంలోనే మా నాయకుడు వైఎస్ జగన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ ఉన్న లీడర్ అని పేర్కొన్నారు. రైతుల్లో భరోసా కల్పించడానికి పర్యటన చేస్తే.. తమ నాయకులను గృహ నిర్బంధం చేశారని, భయానక వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. నేటి జన ప్రవాహం కూటమి ఓటమి ఖరారు చేసిందని భూమన చెప్పుకొచ్చారు.

తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘మామిడి రైతుల్లో భరోసా నింపడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మేలు చేయడానికి వైఎస్ జగన్ బంగారుపాళ్యం వచ్చారు. బంగారుపాళ్యం వెళ్లే దారులు అన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. జగన్ గారి పర్యటనకు అడుగు అడుగునా అవాంతరాలు సృష్టించారు. మా నాయకులకు నోటీసులు ఇచ్చారు. దేశంలోనే మానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ ఉన్న లీడర్. రైతుల్లో భరోసా కల్పించడానికి పర్యటన చేస్తే.. మా నాయకులను గృహ నిర్బంధం చేశారు, భయానక వాతావరణం సృష్టించారు. బంగారుపాళ్యంలో హిట్లర్ కాలంనాటి నాజీ పాలన కనపడింది. జగన్ అంటే జనం, ఎన్ని కుట్రలు చేసినా పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఈ రోజు జన ప్రవాహం కూటమి ఓటమి ఖరారు చేసింది. కూటమి పాలనపై ప్రజల ఆగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడింది’ అని అన్నారు.

Also Read: Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్.. లక్ష ప్రోత్సాహకం! వీడియో వైరల్

‘వైఎస్ జగన్ పర్యటన ఒక సెట్టింగులా ఉంది అంటూ మంత్రి అచ్చెన్నాయుడు వాఖ్యలు సరికావు. మీ మద్దతు ధరలో 4 రూపాయలలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఖరారు కావడంతో కిలో ఆరు రూపాయలు ఇచ్చిన అగ్రిమెంట్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు దగ్గరికి రండి మంత్రి అచ్చెన్నాయుడు. యాభై శాతం మామిడి తోటల్లో పంట కోయలేదు. దారి పొడవునా భయపెట్టినా.. గుట్టలు, కొండలు, తుప్పలు దాటుకుని వచ్చారు. వారంతా దగా పడ్డవారే. మా కార్యకర్తలు, మామిడి రైతులును అడ్డుకుని లాఠీ చార్జి చేశారు. దెబ్బలు తింటూ ‘వందే మాతరం’ నినదించిన స్వాతంత్ర్య పోరాట స్పూర్తి ఈరోజు మామిడి రైతులలో కనిపించింది. మామిడి రైతులు కడుపు మండి రోడ్డు పక్కనే మామిడి కాయలు పారాబోశారు’ అని భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version