Site icon NTV Telugu

IAS officer: “బ్రాహ్మణ కోడలు దొరికే వరకు రిజర్వేషన్లు కొనసాగించాలి”.. సీనియర్ IAS అధికారి వివాదాస్పద ప్రకటన..

Ias

Ias

IAS officer: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో AJAX (మధ్యప్రదేశ్ షెడ్యూల్డ్ కులాలు, తెగల అధికారులు, ఉద్యోగుల సంఘం) ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ప్రాంతీయ అధ్యక్షుడు, సీనియర్ IAS అధికారి సంతోష్ వర్మ వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వర్గాన్ని ఆగ్రహానికి గురి చేసింది.

READ MORE: Ustaad Bhagat Singh :‘ఉస్తాద్ భగత్ సింగ్’..‘తేరి’ రీమేక్ టాక్‌పై నిర్మాత క్లారిటీ!

సంతోష్‌ వర్మ ప్రసంగిస్తూ.. “ఒక బ్రాహ్మణుడు తన కూతురిని నా కొడుకుకు దానం చేసే వరకు లేదా నా కుమారుడు ఆమెతో సంబంధం ఏర్పరుచుకునే వరకు రిజర్వేషన్లు కొనసాగించాలి” అని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. సామాజిక, రాజకీయ వర్గాల్లో కోపాన్ని రగిలించింది. ఈ ప్రకటనపై అఖిల భారత బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుష్పేంద్ర మిశ్రా స్పందించారు. ఈ వ్యాఖ్యలు తమ కుమార్తెలను అవమానించడమేనని అన్నారు. ప్రభుత్వం “కూతురిని రక్షించండి.. కుమార్తెను పెంచండి” వంటి ప్రచారాలకు ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో ఓ సీనియర్ అధికారి చేసిన ఇటువంటి అసభ్యకర ప్రకటన సమాజ గౌరవాన్ని దెబ్బ తీస్తుందన్నారు.

READ MORE: Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఈ కీలక అంశాలపై చర్చ..

రిజర్వేషన్ చర్చకు, బ్రాహ్మణులు, వ్యక్తిగత సంబంధాలకు ముడిపెట్టడం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ వాదన సమాజాన్ని తప్పుడు దిశలో తీసుకెళ్తుందని, సమాజంలో అనవసరమైన ఉద్రిక్తతను పెంచుతుందని బ్రాహ్మణ సమాజం చెబుతోంది. ఈ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ తీవ్రమైంది. అనేక సంస్థలు IAS అధికారి నుంచి వివరణ, క్షమాపణలు కోరుతున్నాయి. అయితే, ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ తన ప్రకటనపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇంతలో బ్రాహ్మణ సంఘం త్వరలో భోపాల్‌లో పెద్ద ఎత్తున నిరసనకు ప్రణాళిక వేస్తుంది.

Exit mobile version