NTV Telugu Site icon

Bhola Shankar Twitter Review: భోళాశంకర్‌ ట్విట్టర్ రివ్యూ.. టాక్‌ ఎలా ఉందంటే?

Bholaa Shankar

Bholaa Shankar

Chiranjeevi, Tamannaah and Keerthy Suresh’s Bhola Shankar Movie Twitter Review: మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా రూపొందిన సినిమా ‘భోళాశంకర్‌’. 2015లో తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు ఇది రీమేక్. ఈ సినిమాలో చిరంజీవికి జతగా మిల్కి బ్యూటీ తమన్నా నటించగా.. మహానటి కీర్తి సురేష్ చెల్లి పాత్ర చేశారు. సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, సురేఖా వాణి, శ్రీ ముఖి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన భోళాశంకర్‌ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భోళాశంకర్‌ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత చిరంజీవి మరో మాస్‌ మూవీ చేస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భోళాశంకర్ మూవీ ప్రీమియర్స్ అర్దరాత్రి నుంచే పడ్డాయి. ఓవర్సీస్ నుంచి టాక్ కూడా వచ్చింది. సినిమా ఎలా ఉందో అని ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

సోషల్ మీడియాలో భోళాశంకర్‌ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంటుంది. అభిమానులు పాజిటివ్ రిపోర్టులు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్, డైలాగ్స్ సినిమాకి హైలైట్ అని ట్వీట్స్ చేస్తున్నారు. సినిమాలో కామెడీ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయని పేర్కొంటున్నారు. ‘బొమ్మ అదిరింది.. మెగాస్టార్ లుక్స్ అదుర్స్’, ‘చిరంజీవి హాస్పిటల్ సీన్ చూస్తే గుండె తరుక్కుపోతుంది’, ‘సిస్టర్ సెంటిమెంట్ బాగా పండింది’, ‘రీమేక్ అయినా.. మెగాస్టార్ చిరంజీవి ఉంటే ఆ కిక్కే వేరప్పా’ అని ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

Show comments