Site icon NTV Telugu

Bhola Shankar : ఓటీటీ లో విడుదల కాబోతున్న భోళా శంకర్.. ఎప్పటి నుంచి అంటే..?

Whatsapp Image 2023 09 07 At 10.18.12 Am

Whatsapp Image 2023 09 07 At 10.18.12 Am

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్‌ హిట్‌ ను అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్‌.ఈ సినిమాకు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించారు.ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చిన భోళాశంకర్‌ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్‌ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించింది.అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించింది. అక్కినేని సుశాంత్‌ ముఖ్య పాత్రలో మెరిశాడు.అలాగే ఈ సినిమాలో శ్రీముఖి, రష్మీ గౌతమ్‌, మురళీ శర్మ, రఘుబాబు, వెన్నెల కిశోర్, గెటప్ శీను వంటి వారు ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ మ్యూజిక్ అందించారు.

అయితే ఈ సినిమాలో ఎప్పటిలాగే చిరంజీవి తనదైన నటన, మేనరిజమ్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంతగానో మెప్పించాడు. సినిమా కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో ప్లాప్ గా నిలిచింది.సుమారు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన భోళా శంకర్‌ నష్టాలనే మిగిల్చింది . కాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయి నెలరోజులు కావస్తుంది.. మెగాస్టార్‌ కంటే ముందు వచ్చిన రజనీకాంత్ జైలర్‌ సినిమా సెప్టెంబర్‌ 7 న అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది.దీంతో ఇప్పుడు అందరి దృష్టి అంతా భోళాశంకర్‌ ఓటీటీ విడుదల పైనే ఉంది..అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ముందుగానే ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.భోళాశంకర్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.భోళాశంకర్‌ ఈ నెలలోనే ఓటీటీలోకి రానుందని సమాచారం.వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 15న స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం.అయితే ఆ తేదీకి కుదరకపోతే సెప్టెంబర్‌ 22న ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని సమాచారం.. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది..

Exit mobile version