NTV Telugu Site icon

Bhola Shankar: మెగా మ్యూజిక్ మేనియా.. కమింగ్ సూన్

Bhola Shankar

Bhola Shankar

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్. వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరు భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైయిన్ మెంట్స్ ఆసక్తికర అప్ డేట్ ఇచ్చింది. ఇక భోళాశంకర్ పాటల సందడికి వేళయిందని వెల్లడించింది. త్వరలోనే భోళాశంకర్ పాటలు అభిమానుల ముందుకు తీసుకువస్తామని ప్రకటించింది. భోళాశంకర్ మెగా మ్యూజిక్ మేనియా వచ్చేస్తోందంటూ మెగా ఫ్యాన్స్ కు తియ్యని శుభవార్త చెప్పింది. కాగా.. భోళాశంకర్ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also:Aghora Puja: మృతదేహంపై కూర్చొని అఘోరా పూజలు

ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తమన్నా కథానాయిక కాగా, చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇప్పటికే భోళా శంకర్ మూవీపై ఫ్యాన్స్ కు భారీ అంచనాలున్నాయి. అందుకు సంబంధించి పాటల సందడి ముందుగానే మొదలవనుంది. మెగాస్టార్ భోళాశంకర్ సాంగ్స్ ఫ్యాన్స్ ను ఏ రేంజ్ లో అలరిస్తాయో వేచి చూడాల్సిందే.

Read Also:Karanataka : బర్త్ డేకి పిలిచింది.. మొఖంపై సలసలకాగే నీరు పోసింది

Show comments