Bhola Shankar : భోళా శంకర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్.ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు.ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చిన భోళాశంకర్ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించింది.అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించింది. అక్కినేని సుశాంత్ ముఖ్య పాత్రలో మెరిశాడు.అలాగే ఈ సినిమాలో శ్రీముఖి, రష్మీ గౌతమ్, మురళీ శర్మ, రఘుబాబు, వెన్నెల కిశోర్, గెటప్ శీను వంటి వారు ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందించారు.
అయితే ఈ సినిమాలో ఎప్పటిలాగే చిరంజీవి తనదైన నటన, మేనరిజమ్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంతగానో మెప్పించాడు. సినిమా కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో ప్లాప్ గా నిలిచింది.సుమారు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన భోళా శంకర్ నష్టాలనే మిగిల్చింది . కాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయి నెలరోజులు కావస్తుంది.. మెగాస్టార్ కంటే ముందు వచ్చిన రజనీకాంత్ జైలర్ సినిమా సెప్టెంబర్ 7 న అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.దీంతో ఇప్పుడు అందరి దృష్టి అంతా భోళాశంకర్ ఓటీటీ విడుదల పైనే ఉంది..అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ముందుగానే ఓటీటీలోకి వస్తుందని అంతా కూడా భావించారు.. కానీ అలా అయితే జరగలేదు.భోళాశంకర్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..తాజాగా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న భోళాశంకర్ ఓటీటీలోకి రాబోతుంది.తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిది నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో మెగాస్టార్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.దీనితో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వారు ఓటీటీ విడుదల కోసం తెగ ఎదురుచూస్తున్నారు.
Also Read
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
తాజావార్తలు
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
OTR: శ్రీకాకుళం మేయర్ సీటు కోసం గుండ లక్ష్మీదేవి ప్రయత్నాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!