NTV Telugu Site icon

Building Collapse: మహారాష్ట్రలో ఘోరం,, భవనం కూలి ముగ్గురి మృతి

New Project (11)

New Project (11)

Building Collapse: మహారాష్ట్రలో ఘోరం చోటు చేసుకుంది. థానే జిల్లా భివాండి ప్రాంతంలో పాత భవనం కూలి ముగ్గురు మృతి చెందారు. వారిలో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఇప్పటి వరకు శిథిలాల నుంచి 12 మందిని రక్షించారు. చనిపోయిన వారిని నవనాథ్ సావంత్ (40), లక్ష్మీదేవి రవి మటో (26), సోనా ముఖేష్ కోరి (5) లుగా గుర్తించారు. పూర్తి వివరాలు.. మహారాష్ట్ర థానే జిల్లా భివాండిలోని వర్ధమాన్ కాంపౌండ్ లో మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో గ్రౌండ్ ప్లస్ మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఆ సమయంలో కింది అంతస్తులో పనిచేస్తున్న కార్మికులు, రెండో అంతస్తులో నివసిస్తున్న కుటుంబాలు శిథిలాల కింద‌ చిక్కుకుబడిపోయాయి.

Read Also:Gold Update : ఒక్క మిస్ కాల్‎తో బంగారం రేట్లు తెలుసుకోండి ఇలా

ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దాదాపు 22 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంత్రి కపిల్ పాటిల్, థానే కలెక్టర్ అశోక్ సింగరే, అసిస్టెంట్ కమిషనర్ సంఘటనా స్థలంలో ఉన్నారు. థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయంతో స్థానికులను రక్షించి చికిత్స కోసం భివాండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన‌ వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.

Read Also:SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ అద్భుత విజయం

Show comments