Bheemla Nayak: అఫీషియల్.. ఫిబ్రవరి 25నే భీమ్లా నాయక్

bheemla nayak

bheemla nayak

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఫిబ్రవరి 25న థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమాలో రానా విలన్‌గా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో అభిమానులకు ఫీస్ట్ అందించనున్నాడు. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు.

కాగా భీమ్లా నాయక్ విడుదల తేదీ ఖరారు కావడంతో పలు సినిమాల విడుదల తేదీలు గందరగోళంలో పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే వరుణ్ తేజ్ ‘గని’, శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్’ వంటి మూవీస్ ఫిబ్రవరి 25న విడుదలవుతాయని గతంలో ప్రకటించారు. ఇప్పుడు భీమ్లా నాయక్ రాకతో ఆయా సినిమాలు వెనక్కి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. ఏదేమైనా పవర్‌స్టార్ అభిమానులు ఇప్పటి నుంచే సంబరాలకు సిద్ధమవుతున్నారు.