Site icon NTV Telugu

Bhatti Vikramarka : కాంగ్రెస్‌ వంద రోజుల పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన ఉంది

రాష్ట్ర ప్రజల్లో వంద రోజుల పాలన పట్ల సానుకూల స్పందన ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌ గాంధీభవన్‌లో పీఈసీ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందని, మనం దేశంలోనే మంచి ఫలితాలు సాధిస్తామని ఆయన అన్నారు. వంద రోజుల పాలన పట్ల ప్రజల్లో ఉన్న స్పందన ను ప్రచారంలో వాడుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. రైతు బంధు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 64 లక్షల 75 వేల మంది రైతులకు 92 శాతం మంది రైతులకు 5 వేల 500 కోట్ల రూపాయలు రైతు బంధు పంపిణీ చేయడం జరిగిందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. వంద రోజుల పాలన ప్రజల్లో మంచి స్పందన ఉంది. సానుకూలంగా ఉందని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికి అభినందనలు తెలిపారు.

USA Cricket Team: USA క్రికెట్ జట్టులో హైదరాబాద్ అమ్మాయికి చోటు..

Exit mobile version