కుల గణనపై ఎన్నికలకు ముందే.. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చెప్తున్నారని.. కుల గణనతో వనరులు, ఆస్తులు సమానంగా అందాలీ అనేది తమ విధానమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఐనా కొద్ది మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారికి మాత్రమే ఫలాలు అందాలని అనుకునే వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సమగ్ర సమాచారం వస్తే.. సంపద ఇంకా ఎంత మందికి అందలేదు అనేది తెలుస్తుందని చెప్పారు. రాజకీయ అవకాశాలు అందాయా..? ఎలాంటి అవకాశాలు వచ్చాయి అనేది సర్వేలో తేలుతుందని స్పష్టం చేశారు. త్వరగా సర్వే నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు.
READ MORE: YSRCP: విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన అప్పలనాయుడు
ఇదిలా ఉండగా.. తాజాగా కుల గణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. కుల గణన.. దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ప్రారంభమైందని తెలిపారు. ఈ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై సీఎం.. ఆకాశం -భూమి ఏకమై, అవకాశాల్లో సమానత్వం, అణగారిన వర్గాల సామాజిక న్యాయం కోసం చేస్తోన్న యజ్ఞం ఇదని తెలిపారు. అలాగే నేడు తెలంగాణ గడ్డ పై మొదలై.. రేపు రాహుల్ సారథ్యంలో దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం ఇది అని వ్యాఖ్యానించారు.