NTV Telugu Site icon

Bhatti Vikramarka: సంజయ్ ఎందుకీ పాదయాత్ర?

Vikramarka1

Vikramarka1

తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఒకవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ధరలు మండిపోతుంటే.. బీజేపీ నేతలు పాదయాత్ర చేయడాన్ని భట్టి తీవ్రంగా ఆక్షేపించారు. బండి సంజయ్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైరయ్యారు. ఎవరి కోసం సంజయ్ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలన్నారు.

పెరిగిన ధరలకు వ్యతిరేకంగా చేస్తున్నావా..? మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారం లోకి రావాలని పాదయాత్ర చేస్తున్నావా..? పేదల అకౌంట్స్ లోకి 15 లక్షలు వేస్తా అని చెప్పి వేయనందుకు పాదయాత్ర చేస్తావా..? పెట్రో డీజిల్ ధరలు ఇంకా పెంచు అని పాదయాత్ర చేస్తున్నావా..? ఉన్న ఉద్యోగాలు పోయేలా చేసి…నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుకు పాదయాత్ర చేస్తున్నావో చెప్పాలన్నారు భట్టి విక్రమార్క.
Read Also:Bandi Sanjay : దేశానికి దళితుడిని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీ, మోడీది

అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసమే మతం ను ఆయుధంగా చేసుకుని పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్, బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు భట్టి విక్రమార్క. 506 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు భట్టి విక్రమార్క. ఇటీవల ఢిల్లీ పర్యటన, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కొంత విరామం తీసుకున్న భట్టి .. తిరిగి మళ్ళీ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మండుటెండలో సైతం పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.