బ్యాంకర్ల మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ లో బ్యాంకర్ల పాత్ర కీలకం.. అభినందనీయం.. తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది.. బ్యాంకర్ల పని తీరు కూడా అభినందనీయం.. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాల్లో తెలంగాణ చేరింది.. రైతు రుణమాఫీ.. రైతు భరోసా.. ప్రాజెక్టుల నిర్మాణం.. ఉచిత కరెంట్ లాంటి వాటితో వ్యవసాయ భాగస్వామ్యం పెరిగింది.. ఎఫ్ సీఐ కి ధాన్యం ఎక్కువ పంపిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణనే..
Also Read:Navya Nair : మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. నటికి రూ.1.14 లక్షల జరిమానా !
బిజినెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం మాది.. చిన్న.. భారీ తరహా పరిశ్రమల గ్రోతింగ్ పెరిగింది.. బ్యాంకర్లకు విజ్ఞప్తి.. అవసరమైన పేదలకు.. ఆర్ధికంగా ఎదగాలని చూస్తున్న వర్గాలకు అండగా ఉండండి.. 4 లక్షల 5O వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం.. నిరుద్యోగ యువత స్వయం సమృద్ధి కోసం బ్యాంకర్లు సహకరించండి.. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వండి.. ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయండి అంటూ రైతులను ఒత్తిడి చేయవద్దని సూచించారు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని కోరారు.
