ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత వరుస ఫ్లాపుల్తో సతమతౌతున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతాడన్న హోప్ క్రియేటయ్యింది. ఖాకీ సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడం, ధమాకా బ్యూటీ శ్రీలీల మరోసారి జోడీ కట్టడంతో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నారు. తీరా చూస్తే మాస్ జాతర డిజాస్టర్ అయింది. దాంతో ఇప్పుడు నెక్ట్స్ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో సంక్రాంతికి వస్తున్నాడు. అయితే గతంలో పొంగల్‌కు పలు సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న ట్రాక్ రికార్డ్ రవితేజది.
Also Read : Re Release Trend : రీరిలీజ్ ఫ్యాన్ వార్.. మురారి4K vs జల్సా4K
రవితేజ కమర్షియల్ హీరోగా మారాక సంక్రాంతికి వచ్చిన సినిమాలు హిట్స్ మాత్రమే కాదు బ్లాక్ బస్టర్స్ నమోదు చేశాయి. 2008లో పొంగల్ బరిలోకి దిగిన కృష్ణ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రూ. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి11న రిలీజైన రూ. 25 కోట్లను వసూలు చేసింది. 2010లో రవితేజ, నరేష్ , శివ బాలాజీ నటించిన శంభో శివ శంభో హిట్. అలాగే 2011లో వచ్చిన మిరపకాయ్ రవితేజ కెరీర్‌లోనే ది బెస్ట్ ఫిల్మ్‌గా మారింది. ఈ సినిమాతో మాస్ మహారాజ్ ట్యాగ్ స్థిరపడిపోయింది. 2021లో సంక్రాంతి బరిలో దిగిన క్రాక్ కూడా సూపర్ హిట్ నమోదు చేసింది. చిరుతో కలిసి 2023లో పొంగల్‌కు వచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ సక్సెస్ అందుకుంది. సంక్రాంతికి కేవలం హిట్సే కాదు ఫ్లాప్ చవిచూశాడు మాస్ మహారాజ్. హీరోగా మంచి పీక్స్ లో ఉన్నప్పుడు 2003లో సంక్రాంతికి వచ్చిన ఈ అబ్బాయి చాలా మంచోడు ఫ్లాపైంది. కానీ సినిమాపై విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా మినహా మిగిలిన సంక్రాంతుల్లో సక్సెస్ ట్రాక్ రికార్డ్స్ మెయిన్ టైన్ చేస్తున్నాడు రవితేజ. నెక్ట్స్ పొంగల్‌కు వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తికి ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ మాస్ మహారాజ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా చూడాలి.
