Site icon NTV Telugu

RT76 : భర్త మహాశయులకు విజ్ఞప్తి.. సంసార సాగరంలో స్టార్ హీరోకు కష్టాలు…

Rt76

Rt76

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు మాస్ మ‌హారాజ. లేటెస్ట్ గా భాను భోగ‌వర‌పు ద‌ర్శక‌త్వంలో నటించిన ‘మాస్ జాత‌ర’ అక్టోబరు 31న రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మాస్ హీరో ఆశలన్నీ కిషోర్ తిరుమలపైనే. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమ‌ల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రవితేజతో సినిమా చేస్తున్నాడు.

Also Read : Thalaivar173 : రజనీకాంత్ హీరోగా.. కమల్ హాసన్ నిర్మాతగా దర్శకుడు ఎవరంటే?

మాస్ రాజా కెరీర్ లో 76వ సినిమాగా వస్తున్న ఈ సినిమా కోసం ఓ క్యాచీ టైటిల్ ను అనుకుంటున్నారట మేకర్స్. కిషొర్ తిరుమల సినిమాలకు ఉండే సాఫ్ట్ టైటిల్ అలాగే రవితేజ సినిమాలలో ఉండే తింగరితనం కలిపి ఉండేలా ఈ సినిమాకు “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ విషయాన్నీ ఈ నెల 10న అఫీషియల్ గా ప్రకటించేందుకు ముహూర్తం పెట్టారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే సంసార సాగరంలో భర్తలు అనుభవించే కష్టాలు, భార్య భర్తల మధ్యవచ్చే తగాదాలు వంటి అంశాలతో రాబోతుంది. అటు ఫ్యాన్స్ కూడా రవితేజ నుండి ఇలాంటి సినిమాలనే కోరుకుంటున్నారు. ఈ సినిమాకు కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ నెలాఖరుకు టోటల్ షూటింగ్ ఫినిష్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో SLV సినిమాస్ బ్యానర్‌పై  సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు

Exit mobile version