Site icon NTV Telugu

Bharateeyudu 2 : ‘భారతీయుడు 2’ సెకండ్ సింగిల్ రిలీజ్ టైం ఫిక్స్..

Chengaluva

Chengaluva

Bharateeyudu 2 : విశ్వనటుడు కమల్ హాసన్ ,స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నలేటెస్ట్ మూవీ “భారతీయుడు2”.బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బాబీ సింహ,ఎస్.జె సూర్య వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also :Pushpa 2 : “పుష్ప 2” సెకండ్ సింగిల్ అదిరిపోనుందా..?

ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో చిత్ర యూనిట్ బిజీ గా వుంది.మేకర్స్ ఈ సినిమాను జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి గ్లింప్సె వీడియో ,పోస్టర్స్ రిలీజ్ చేయగా సినిమాపై భారీగా అంచనాలు భారిగా పెరిగాయి.రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.శౌర అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ ను రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ మధ్య “చెంగలువ”  అంటూ సాగే  లవ్ సాంగ్ ప్రోమోను మేకర్స్ నేడు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు  ప్రకటించారు.ఈ సినిమా ఆడియో లాంచ్ ను మేకర్స్ జూన్ 1 న గ్రాండ్ గా నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ కు స్టార్ హీరోలు గెస్ట్ లుగా రానున్నారు.

Exit mobile version