Site icon NTV Telugu

Bharat Margani: బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానం ఉంది.. మాజీ ఎంపీ ఫైర్..

Bharath

Bharath

Bharat Margani: బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానం ఉందని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సినిమా ఫంక్షన్ లకు “పుచ్చుకుని” వెళ్లినట్టు అసెంబ్లీకి వచ్చారా? అని విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాట తీరు, వ్యవహార శైలి దారుణంగా ఉందన్నారు. నెత్తి మీద విగ్గు, దానిమీద గాగుల్స్, జేబులో చేతులు పెట్టుకుని మాట్లాడతారా? అని ప్రశ్నించారు. మీ స్థాయి ఏంటో జనసేన వారే తేల్చి చెప్పారు. బాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్ తో చెక్ చేయించాలన్నారు. ఆయన మాట తడపడుతూ మాట్లాడుతున్నారని చెప్పారు.

READ MORE: CBSE Scholarship: సీబీఎస్‌ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్.. ప్రతి నెల పొందొచ్చు.. అర్హులు ఎవరంటే?

ఇదిలా ఉండగా.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులకు గురి చేస్తున్నారని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. “ఇప్పటికి 86 మందిని అరెస్టు చేశారు. హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రభుత్వానికి బుద్ది రాలేదు. ఎస్సీ కమిషన్ సీరియస్ అయి నోటీసులు కూడా ఇచ్చింది. సీసీ కెమెరా పుటేజీ అడిగితే కెమెరాలు పని చేయటం లేదని అధికారులు అబద్దాలు చెప్పారు. పోలీసులను టీడీపీ నేతల కోసం వాడుతున్నారు. బ్లేడ్ బ్యాచ్ ఏకంగా పోలీసులపై దాడి చేశారు. రాష్ట్రంలో రౌడీయిజం అంత దారుణంగా పెరిగిపోయింది. అమరావతి ముంపునకు గరైందని ఒక అధికారి పోస్టు పెడితే సస్పెండ్ చేశారు. అసలు రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర్యం ఉందా? నారా లోకేష్ జగన్ ని సైకో అంటూ మాట్లాడారు. ఆయనపై ఎన్ని కేసులు పెట్టాలి? మా కార్యకర్తలపై వేధింపులకు దిగిన వారికి డిజిటల్ బుక్ ద్వారా సరైన సమాధానం చెప్తాం..” అని భరత్ వ్యాఖ్యానించారు.

READ MORE: Bathukamma Festival: ఏపీలో ఘనంగా బతుకమ్మ పండుగ.. ఎక్కడంటే..?

 

Exit mobile version