NTV Telugu Site icon

Advani: అద్వానీకి భారతరత్న

Advani

Advani

Bharat Ratna Award: మాజీ ఉప ప్రధాన మంత్రి, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా (ఎక్స్) వెల్లడించారు. దేశానికి అద్వానీ చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డ్ ఇస్తున్నట్లు ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్‌ చేసిన ప్రధాని కంగ్రాట్స్‌ చెప్పినట్లు తెలిపారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని.. దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రాత్మకమైనదని భాతర ప్రధాని వెల్లడించారు.