Site icon NTV Telugu

Bharat Petrol: ఎంతకు తెగించార్రా.. ఉప్పల్ లో భారత్ పెట్రోల్ పంపు ఘరానా మోసం.. మిషన్ లో సెట్టింగ్ పెట్టి..

Petrol

Petrol

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వాహన యజమానులకు ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు పెట్రోల్ పంపులు మోసాలకు పాల్పడుతుండడంతో వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మీటర్ ను రీ సెట్ చేయకపోవడం, ఎలక్ట్రానిక్ చిప్ లు పెట్టి మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఘరానా మోసం వెలుగుచూసింది. భారత్ పెట్రోల్ పంపులో మోసం జరుగుతున్నట్లు వాహనదారులు తెలిపారు. మెహిఫిల్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న భారత్ పెట్రోల్ పంపులో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టారు.

Also Read:Robert Vadra: రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ సమన్లు

బాటిల్ లో పెట్రోల్ కొట్టించగా పెట్రోల్ పంపు దందా బయటపడింది. యాజమాన్యం మిషన్ లో సెట్టింగ్ పెట్టి పెట్రోల్ తక్కువ పోస్తున్నట్లు వెల్లడైంది. ఇందేటి అని కస్టమర్లు ప్రశ్నించగా పొంతన లేని సమాధానంతో యాజమాన్యం బుకాయిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 100 రూపాయల పెట్రోల్ ను బాటిల్ లో కొట్టించగా తక్కువ వచ్చింది. ఇదేంటి అని అడగగా 100 రూపాయలకు అంతే వస్తుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నట్లు వాహనదారులు ఆరోపించారు. అధికారులు భారత్ పెట్రోల్ పంపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Exit mobile version