Site icon NTV Telugu

Bhakti Bharat TV: భారతావనికి ‘భక్తి భారత్’.. ‘భక్తి భారత్ టీవీ’ లోగో ఆవిష్కరణ..

Bakhti Barth Tv

Bakhti Barth Tv

భక్తి టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరు. నిత్యం భక్తి కార్యక్రమాలతో వీక్షకులను భక్తి పారవశ్యంలో మునిగి తేలేలా చేస్తుంది. ప్రతి ఇంట్లో ఆధ్యాత్మికత శోభ ఉట్టిపడేలా చేస్తుంది భక్తి టీవీ. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్‌ ‘భక్తి టీవీ’ అరుదైన ఘనత సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దేశంలోనే ‘నంబర్-1’ ఆధ్యాత్మిక ఛానెల్‌గా భక్తి టీవీ నిలిచింది. బార్క్‌ (BARC) రిలీజ్ చేసిన రేటింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ హిందీ ఛానెల్స్‌ను సైతం అధిగమించి భక్తి టీవీ నెంబర్ వన్ స్థానంకు దూసుకొచ్చింది.

Also Read:Ladakh Earthquake: లడఖ్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం

ఇక ఇప్పుడు భక్తి టీవీ కార్యక్రమాలను దేశం నలుమూలలా వ్యాప్తి చేసేందుకు రచన టెలివిజన్‌ లిమిటెడ్‌ మరో అడుగు ముందుకు వేసింది. కోటి దీపోత్సవం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో శ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శృంగేరి జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి చేతుల మీదుగా భక్తి భారత్ టీవీ లోగోను ఆవిష్కరించారు. ఈ ఛానల్ ద్వారా భక్తి కార్యక్రమాలను భారత్ మొత్తం వీక్షించడానికి వీలు కలిగినట్లైంది.

Also Read:CM Revanth Reddy : కెనడా హైకమిషనర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

కాగా కోటి దీపోత్సవం నవంబర్ 1 నుంచి 13 వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా కొనసాగనుంది. కార్తిక మాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభమే కోటి దీపోత్సవం. ఈ మహాక్రతువుకు గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరుకానున్నారు.. నేత్రపర్వంగా సాగే మహా ఆధ్యాత్మిక క్రతువుకు ఎన్టీఆర్ స్టేడియం ఇల కైలాసం కానుంది. ప్రతి రోజు సాయంత్రం 5.30కు దీపాల పండగ ఆరంభం కానుంది.

Exit mobile version