భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్తీక సోమవారం అయిన ఈరోజు ప్రారంభం కాబోతోంది. ఇవాళ్టి నుంచి నవంబర్ 14 వరకూ ఈ ఆధ్యాత్మిక సంరంభం జరగనుంది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం కోటి దీపోత్సవానికి సిద్ధం అయింది. లక్షలాదిమంది భక్తులు వచ్చి స్వయంగా దీపాలు వెలిగించే మహదావకాశం కలుగుతుంది. ఆ దీప వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు భక్తి టీవీ ఈ మహాక్రతువును నిర్వహిస్తోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవంతో భాగ్యనగరం భూ కైలాసంగా మారుతుంది. అన్ని దారులు .. కోటి దీపోత్సవం వైపే మరలుతాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలో భక్త జన సంద్రం నెలకొంటుంది.
కోటిదీపోత్సవం జరిగే ప్రాంతంలోకి మనం చేరగానే ఆధ్మాత్మిక మత్తు మన హృదయాలను తాకుతుంది. మనసు మైమరచిపోతుంది. ఇంతటి మహాకార్యం ఒక్క భక్తిటీవీకి సాధ్యం అయింది. ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ కుటుంబం మొత్తం ఈ కోటి దీపోత్సవం కోసం నిరంతరం పరిశ్రమిస్తూ వుంటుంది. లక్షలాదిమందిని ఒక చోట చేరుస్తున్న కోటి దీపోత్సవం శుభవేళ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. రండి.. తరలి రండి.. కోటి దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించి దీపకాంతుల్లో ఆనందాన్ని ఆస్వాదించండి.
భక్తి టీవీ కోటి దీపోత్సవం తొలి రోజు కార్యక్రమాలు Day 1 (కార్తీక సోమవారం)
ఉడుపి పెజావర అధోక్షజ మఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ వారిచే అనుగ్రహభాషణం వుంటుంది.
బ్రహ్మశ్రీ డా.బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ప్రవచనామృతం వుంటుంది.
కాశీ స్పటిక లింగానికి సహస్ర కలశాభిషేకం, శివలింగాలకు కోటిమల్లెల అర్చన
ఈరోజు కల్యాణం …కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర కల్యాణం
ఈరోజు హంసవాహనంపై వాహనసేవ …వంటి కార్యక్రమాలు ఉంటాయి.