NTV Telugu Site icon

Bhakthi TV Koti Deepotsavam 2024 : భక్తి టీవీ కోటి దీపోత్సవం.. నవంబర్‌ 9 నుంచి 25 వరకు..

Koti Deepotsavam

Koti Deepotsavam

Bhakthi TV Koti Deepotsavam 2024 : కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది.. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రంగా భావిస్తారు.. కార్తీక స్నానాలకు, ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రధమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.. ఇక, కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది.. ఈ ఏడాది కూడా ఘనంగా కోటిదీపోత్సవ యజ్ఞాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది భక్తి టీవీ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా నవంబర్ 9 నుంచి 25 వరకు కోటిదీపోత్సవ మహాయజ్ఞం జరగనుంది.

లక్ష దీపాలతో ప్రారంభించిన ఈ దీప యజ్ఞాన్ని ఆ తర్వాత కోటి దీపోత్సవంగా విస్తరించింది ఎన్టీవీ-భక్తి టీవీ యాజమాన్యం.. దేదీప్యమానంగా వెలిగే దీపపు కాంతులు, ప్రచానామృతాలు, కల్యాణ కమనీయాలతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తే కోటి దీపోత్సవం ఈ నెల నవంబర్‌ 9వ తేదీన ప్రారంభం కానుంది.. ప్రతీ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాగే ఈ దీపయజ్ఞం నవంబర్‌ 25వ తేదీ వరకు కొనసాగనుంది.. శివకేశవులని ఒకేవేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే కోటి దీపోత్సవం. జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను ఒక్క వేదిక మీదకు తెచ్చేందుకు ఈ పవిత్ర దీపోత్సవం సాగుతోంది.. ఇక, వేలాది మంది భక్తులతో కోటిదీపోత్సవ ప్రాంగణం వెలిగిపోతుంది.. ప్రవచనాలతో మొదలై, ప్రత్యేక అర్చనలు, దేవదేవుల కళ్యాణాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతోన్న ఈ దీపయజ్ఞంలో వివిధ పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తలు తమ సందేశాలు ఇస్తారు.. నవంబర్ 9 నుంచి ఆరంభంకాబోతోన్న దీప యజ్ఞంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది ఎన్టీవీ – భక్తి టీవీ.