Site icon NTV Telugu

Bhagyashri Borse : భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్.. ఇక అయ్యగారే బ్రేక్ ఇవ్వాలి

Bhagyasri Borse

Bhagyasri Borse

మిస్టర్ బచ్చన్‌తో ఓవర్ నైట్ కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిన భాగ్యశ్రీ బోర్సేకి క్రేజేతే ఉంది కానీ లక్ మాత్రం ఆమడ దూరంలో ఆగిపోతోంది. కెరీర్ స్టార్టింగ్ నుండి ప్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో సరైన ఐడెంటిటీ రాకపోవడంతో టాలీవుడ్‌లో పాతుకుపోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.. గ్లామర్ షోతో డామినేట్ చేస్తొంది కానీ హిట్ సౌండ్ వినలేకపోతోంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయితే ఈ ఏడాది వచ్చిన కింగ్డమ్ ఆమెను నిరాశపర్చింది.

Also Read : Dacoit : డెకాయిట్ మేకింగ్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న అడివి శేష్

ఆ సినిమాతో మరో ప్లాప్ ఆమె ఖాతాలో పడి కెరీర్ని డైలామాలో పడేసింది. దాంతో ఆశలన్నీ దుల్కర్ సల్మాన్ పైనే పెట్టుకుంది. రానా, దుల్కర్ కాంబోలో నటించిన కాంత ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక లేటెస్ట్ గా తన ఆశలన్నీ ఆంధ్ర కింగ్ తాలూకా పై పెట్టుకుంది. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుండి హిట్ టాక్ వచ్చింది. ఓవర్సీస్ లో రామ్ – భాగ్యశ్రీ కాలికి బలపం కట్టి మరి ప్రమోషన్ చేశారు. ఓపెనింగ్ బాగా అందుకున్న ఈ సినిమా అంచనాలు తలకిందులు చేస్తూ ప్లాప్ దిశగా పయనిస్తుంది. ఇక తెలుగు స్టేట్స్ లో అయితే ఏకంగా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా రిజల్ట్ తో భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్ వచ్చి చేరింది. ఇక భాగ్యం ఆశలన్నీ అయ్యగారు లెనిన్ పైనే. మరి ఆయ్యగారు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.

Exit mobile version