NTV Telugu Site icon

Bhagyashri Borse : లక్కీ హీరోయిన్.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

Befunky Collage 12

Befunky Collage 12

సినిమా ఇండస్ట్రీలో అందంతో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలి.. అప్పుడే వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. ఒక్క సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి.. మొన్నటివరకు శ్రీలీలా పేరు తెగ ట్రెండ్ అవుతుంది.. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తుంది.. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కావడం విశేషం.. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను పట్టేసినట్లు తెలుస్తుంది..

న్యాచురల్ స్టార్ నాని ఇటీవల సుజిత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా హీరోయిన్ గా భాగ్య శ్రీని ఎంపిక చేసినట్లు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయని తెలుస్తుంది.. ఇది కనుక ఫిక్స్ అయితే ఇక అమ్మడు నక్క తోక తొక్కినట్లే.. ఇప్పటికే విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుంది.. ఇప్పుడు ఈ సినిమా.. ఎంట్రీతోనే మూడు సినిమాల్లో నటిస్తుంది.. ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది..

డెబ్యూ డైరెక్టర్ రవి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అమెరికా బ్యాక్ గ్రౌండ్‌లో సాగే ఈ లవ్ స్టోరీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభం కానుంది.. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. మొత్తంగా చూసుకుంటే అమ్మడు సినిమాల లైనప్ మాములుగా లేదు.. ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టుకుంది..